Sneha Guptha: గణేష్ వెంకట్ రామన్, అమిత్ తివారీ, సాయి ధన్సిక, విమలా రామన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘అంతిమ తీర్పు’. ఎ. అభిరాం దర్శకత్వంలో సిద్ధి వినాయక డి. రాజేశ్వరరావు దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ‘టిప్పా టిప్పా..టిప్ప.. టిప్పర్ లారీ నా ఒళ్లే; రప్ప… రప్ప.. రప్ప వత్తే యాక్సిడేంటేలే…’ అంటూ సాగే పాటను ఇటీవల విడుదల చేశారు. కోటి స్వరాలు సమకూర్చిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాయగా, ప్రముఖ గాయని మంగ్లీ గానం చేసింది. అమిత్‌తివారీ, స్నేహా గుప్తాపై ఈ ఐటమ్ సాంగ్ ను ఈశ్వర్ పెంటి డాన్స్ కొరియోగ్రఫీలో తెరకెక్కించారు.
ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ “చక్కని కథాంశంతో రూపొందిన చిత్రమిది. చిత్రీకరణ పూర్తయింది. ‘టిప్పా టిప్పా’ సాంగ్ సూపర్ డాన్స్ నంబర్. ఈ పాటను డాగ్ హౌస్‌లో నాలుగు రోజులపాటు చిత్రీకరణ చేశాం. టి. సిరీస్ ద్వారా విడుదల చేశాం. కోటి గారు ఇందులోని ప్రతి పాటకు చక్కని స్వరాలు అందించారు. ఇటీవల విడుదలైన ఐటమ్ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మంగ్లీ హస్కీ వాయిస్‌తో పాడిన ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇదే ఉత్సాహంతో త్వరలో సెకెండ్ లిరికల్ సాంగ్, టీజర్‌ను విడుదల చేస్తాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని అన్నారు.