Manchu Vishnu : మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమాతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ఆయన డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న కన్నప్ప సినిమా ఆయన ఎంటైర్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తోంది. ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ కీలక పాత్రలు చేస్తుండటంతో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. మొదట్లో ఈ మూవీపై ట్రోల్స్ వచ్చినా.. ఇప్పుడు పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 25న రిలీజ్ అవుతుండటంతో మూవీ ప్రమోషన్లు పెంచేశారు. ఇందలో భాగంగా మంచు విష్ణు ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పిల్లల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Read Also : Aamir Khan : ఆమె వల్ల నరకం అనుభవించా.. అమీర్ ఖాన్ ఎమోషనల్..
‘నాకు ఇప్పటికే నలుగురు పిల్లలు ఉన్నారు. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. అందుకే ఐదో సంతానం కూడా కావాలని అన్నాను. కానీ నా భార్య విరానిక ఒప్పుకోలేదు. ఐదో సంతానం కోసం వేరే వాళ్లను చూసుకో అని ఛాలెంజ్ చేసింది. ఎందుకో నాకు అది కొంచెం బెదిరింపులాగా అనిపించింది. అందుకే ఆగిపోయాను’ అంటూ చెప్పుకొచ్చాడు. మంచు విష్ణుకు ఇప్పటికే ముగ్గురు కూతుర్లు, ఓ కొడుకు ఉన్నారు. కన్నప్ప సినిమా కోసం మంచు విష్ణు, మోహన్ బాబు చాలా కష్టపడుతున్నారు. ఈ మూవీ నుంచి తరచూ ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు. త్వరలోనే ప్రమోషన్స్ కు ప్రభాస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.