Kannappa : కన్నప్ప సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా వస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 25న రిలీజ్ చేయబోతున్నారు. విష్ణు కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. ఇందులో మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ లాంటి వారు కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రమోషన్లలో భాగంగా తాజాగా రెడ్ లారీ ఫిలిమ్ ఫెస్టివల్ లో కన్నప్ప సినిమాను ప్రమోట్ చేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు చాలా కీలక విషయాలను వెల్లడించారు. కన్నప్ప సినిమాకు ముందు తాను హనుమాన్ భక్తుడిగా ఉన్నానని.. ఈ సినిమా ప్రయాణంలో తాను శివ భక్తుడిగా మారిపోయానన్నారు.
Read Also : Collectors Conference: రేపు, ఎల్లుండి కలెక్టర్ల కాన్ఫరెన్స్.. ప్రధానంగా వీటిపైనే ఫోకస్..
‘మూవీలో ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుంది అని చాలా మంది అడుగుతున్నారు. మీరు ఎంత ఊహించుకున్నా అంతకు మించి ప్రభాస్ పాత్ర ఉంటుంది. ఇందులో ప్రతి పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. 2015 నుంచే ఈ సినిమాను ప్లాన్ చేసుకుంటున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు విష్ణు. నటులు బ్రహ్మాజీ, రఘుబాబు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సినిమాను ఎవరు ట్రోల్ చేసినా శివుడి శాపానికి గురవుతారంటూ రఘుబాబు చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి.