Manchu Vishnu: దమ్ముంటే ఆ బడా హీరో పేరు చెప్పు.. లేదంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Vishnu: మంచు ఫ్యామిలీ, మంచు విష్ణు గురించి సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగని రోజు లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇక నిత్యం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే మంచు విష్ణు మా ఎలక్షన్స్ నుంచి మరింత ట్రోలింగ్ వస్తువు గా మారిపోయాడు. దీనిపై మంచు ఫ్యామిలీ ఎప్పుడో సీరియస్ అయిన విషయం విదితమే.. తమ కుటుంబం పై వచ్చే ట్రోల్స్ ను భరించలేక పోలీసులను కూడా ఆశ్రయించారు. ఇక మా ప్రెసిడెంట్ గా విష్ణు గెలిచాకా ఈ ట్రోల్స్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసిన విషయం కూడా విదితమే.. తనను తన కుటుంబాన్ని బ్యాడ్ చేయడానికి ఒక బడా హీరో ఒక ఆఫీస్ పెట్టించి ట్రోల్స్ చేయించాడని, మా ఎలక్షన్స్ లో తనను గెలవకుండా చేయడానికి ఎన్నో కుట్రలు చేయించాడని చెప్పుకొచ్చాడు. అయితే బడా హీరో పేరు మాత్రం చెప్పలేదు.. పేరు చెప్పండి అని అడిగినా ఇప్పటివరకు విష్ణు స్పందించింది లేదు.
ఇక తాజాగా జిన్నా ప్రమోషన్స్ లో బడా హీరో గురించి చెప్పుకొచ్చాడు. ” ఆ బడా హీరో చెప్పొచ్చు కదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. అతను పెద్ద మేధావి.. అతని గురించి మీడియాకు తెలియదా..? మీకు తెలియదా..? నా నోటితో ఎందుకు చెప్పించాలనుకుంటున్నారు.. నేను అతని పేరు చెప్పి ఇండస్ట్రీ పరువు తీయాలనుకోవడం లేదు” అని చెప్పుకొచ్చాడు. ఇక దీంతో మరోసారి విష్ణు ట్రోలర్స్ చేతికి చిక్కాడు. మా ప్రెసిడెంట్.. దమ్ముంటే హీరో పేరు చెప్పు.. లేకపోతే ఏం మాట్లాడకుండా కూర్చో అని కొందరు.. అసలు బడా హీరో లేదు ఏం లేదు ఏదో ఫేమస్ అవ్వడానికి సోది చెప్తున్నాడు అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఇక విష్ణు నటించిన జిన్నా సినిమా అక్టోబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఈ హీరో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?