మా అధ్యక్షుడు మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో సినిమా టికెట్ రేట్ల పెంపు సహా కొన్ని విషయాల మీద అస్యాన స్పందించారు. ఈ ఏడాది మోహన్ బాబు యూనివర్సిటీ ప్రారంభం అవుతుందని మంచు విష్ణు అన్నారు. ఇందులో సినీ అకాడమీ కూడా ఉంటుందని, సినిమాకు సంబంధించిన అన్ని రంగాలలో ఇక్కడ శిక్షణ ఉంటుందని ఆయన అన్నారు. ఇక సినిమా టిక్కెట్ల ధరల విషయంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పెంచారు… ఏపీలో తగ్గించారు.. కానీ రెండు చోట్లా కోర్టుకు వెళ్లారు కాబట్టి దీనిపై సినీ పరిశ్రమ ఏకత్రాటి పైకి రావాలని అన్నారు. టికెట్ల ధరల వివాదంపై తెలుగు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం మేరకు ముందుకు వెళదామన్న ఆయన ఒకరిద్దరు మాట్లాడి దీనిపై వివాదం చేయడం సరికాదన్నారు. రెండు ప్రభుత్వాలతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తాము నేను విడిగా మాట్లాడి సమస్య పక్కదారి పట్టించలేనని విష్ణు పేర్కొన్నారు.
Read also : జన జాగృతి పార్టీలో చిరంజీవి
రెండు ప్రభుత్వాలు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాయని, ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి… కలిసి మెలసి ఓ నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. ఏపీలో టికెట్ ధరపై ఏర్పాటైన సబ్ కమిటీని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కలిసింది. వారు అడిగితే మేము కూడా కలుస్తామని అన్నారు. ఇక చిరంజీవి, జగన్ కలయిక పర్సనల్ మీటింగ్… దానిని అసోసియేషన్ మీటింగ్ గా భావించకూడదని అన్నారు. మా అసోసియేషన్ 100 రోజుల ప్రగతిపై త్వరలో మీడియాతో మాట్లాడుతానన్న విష్ణు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సినిమా టికెట్లపై నిర్ణయం తీసుకుంటుందని, వ్యక్తిగతంగా నా నిర్ణయంతో పని లేదు.. ఎవరూ నా అభిప్రాయం అడగడం లేదని అన్నారు. సినిమా టికెట్స్ పై వైఎస్సార్ హయాంలో ఓ జీవో వచ్చిందని దానిపై కూడా చర్చ జరగాలని అన్నారు. ఇక ఈ టికెట్ల విషయంలో నన్ను విమర్శిస్తున్నారు అంటే నేను పాపులర్ అని అర్థం అని ఆయన చెప్పుకొచ్చారు.