మా అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రెసిడెంట్‌గా ప్రకాష్ రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించారు. డ్రామాలు, విమర్శలు, ఆరోపణల మధ్య మంచు విష్ణు ప్యానెల్ మెజారిటీ సాధించింది. ఈ రోజు మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పదవిని చేపట్టారు. నరేష్ నుంచి బాధ్యలను తీసుకున్న మంచు విష్ణు ఇకపై ‘మా’ అధ్యక్షుడుగా కొనసాగుతారు. పెండింగ్ పెన్షన్స్ ఫైల్ పైన మంచు విష్ణు అధ్యక్షుడిగా తొలి సంతకం చేశారు. వైస్ ప్రెసిడెంట్ గా మాదాల రవి, కార్యదర్శిగా రఘుబాబు, కోశాధికారిగా శివబాలాజీ బాధ్యతలు స్వీకరించారు.

Read Also : మాల్దీవులలో ఫ్యామిలీతో బన్నీ- ఈ ఏడాది రెండోసారి

ఈ రోజు ఆఫీసులో తన మొదటి రోజు ఫోటోను పంచుకుంటూ “నేను ఈరోజు ‘మా’ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాను! మీ ఆశీస్సులు కావాలి. వీలైనంత వరకు నాకు పాజిటివిటీని పంపండి” అంటూ ట్వీట్ చేశారు. అసోసియేషన్‌లోని కళాకారుల సంక్షేమం కోసం మంచు విష్ణు, అతని ప్యానెల్ సభ్యులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడానికి ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు రాజీనామాలు చేశారు. ప్రెస్ మీట్ సమయంలో ప్రకాష్ రాజ్ బృందం మంచు విష్ణు ప్యానల్ పై ఆరోపణలు, విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు.

మా అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం
-Advertisement-మా అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం

Related Articles

Latest Articles