Ginna Movie: మంచు విష్ణు చాలా కాలం నుంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఢీ, దేనికైనా రెడీ, దూసుకెళ్తా తర్వాత అలాంటి విజయం కోసం మంచు విష్ణు ఉవ్విళ్లూరుతున్నాడు. అతడు నటించిన లేటెస్ట్ మూవీ ‘జిన్నా’. ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచే వివాదాస్పదంగా మారింది. అయితే ఆ జిన్నాకు, ఈ జిన్నాకు సంబంధమే లేదని.. గాలి నాగేశ్వరరావు పాత్రలో తాను కనిపిస్తున్నానని మంచు విష్ణు వివరణ ఇచ్చాడు. ఈ మూవీలో పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. దర్శకుడు ఈషాన్ సూర్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. జిన్నా చిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మంచు విష్ణు తన సోషల్ మీడియాలో ప్రకటించాడు. అక్టోబర్ 5న రానున్నట్లు చెప్తూనే క్వశ్చన్ మార్క్ పెట్టి సందేహాలకు తెరతీశాడు.
20 Years Of Avunu Valliddaru Ista Paddaru: 20 ఏళ్ళ కిందట ‘ఔను…వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’..!!Read Also:
అయితే మంచు విష్ణు క్వశ్చన్ మార్క్ పెట్టడానికి ఓ కారణముంది. అదే రోజున మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాఢ్ ఫాదర్’, అక్కినేని నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు సినిమాలకు టాలీవుడ్‌లో మంచి బజ్ ఉంది. దీంతో ఆ చిత్రాలతో పోటీ పడితే తన మూవీకి కూడా క్రేజ్ వస్తుందని మంచు విష్ణు ఆశిస్తున్నాడు. జిన్నా మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా జిన్నా తెరకెక్కుతోంది. కాగా ఇద్దరు అగ్రహీరోల మధ్య మంచు విష్ణు సినిమా వస్తుండటంతో విజయదశమికి ఏ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందో వేచి చూడాలి.
October 5th?! 🤩💪🏽❤️✊🏽🤩
— Vishnu Manchu (@iVishnuManchu) August 1, 2022