Manchu Vishnu: కన్నప్ప… కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అయ్యేలా ఉందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు విష్ణు తన కెరీర్ బెస్ట్ సినిమాని చేసి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. తన మార్కెట్ గురించి ఆలోచించకుండా కేవలం కథని మాత్రమే నమ్మి భారీ బడ్జట్ తో ఎపిక్ సినిమా ‘కన్నప్ప’ చేస్తున్నాడు. ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, నయనతారలు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు అంటే కన్నప్ప సినిమాని మంచు విష్ణు ఎంత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు. సినిమా షూటింగ్ మొత్తం న్యూజిల్యాండ్ లోనే జరుగుతూ ఉంది, జనవరి వరకూ అక్కడే ఉండి ఒకేసారి షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోని రావాలి అనేది విష్ణు ప్లాన్. మంచు మోహన్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్న కన్నప్ప సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఎపిక్ మహాభారతం సీరియల్ ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ కన్నప్ప సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు అంటే పక్కా ఇది మంచి ప్రాజెక్ట్ గానే మౌల్డ్ అవుతుంది.
కన్నప్ప సినిమాకి రైటర్ గా మంచు విష్ణు పేరు పడుతుండడం విశేషం. స్టోరీ డెవలప్మెంట్ విషయంలో మంచు విష్ణుకి పరుచూరి గోపాలకృష్ణ, ఈశ్వర్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, తోట ప్రసాద్ అండగా నిలిచారు. ఇక ఈరోజు మంచు విష్ణు పుట్టిన రోజు కావడంతో మేకర్స్ కన్నప్ప నుంచి ప్రీలుక్ పోస్టర్ ని లాంచ్ చేసారు. టైటిల్ లోగో కూడా రివీల్ చేసిన మేకర్స్, బాణాల మధ్యలో విల్లుని పట్టుకోని దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న మంచు విష్ణుని చూపించారు. ఫేస్ రివీల్ చేయకుండా డిజైన్ చేసిన పోస్టర్ లో… శివలింగం కనిపించేలా క్రియేట్ చేయడం పోస్టర్ కే హైలైట్ గా నిలిచింది. చాలా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ఈ పోస్టర్… ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి మంచి ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. ప్రభాస్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా కన్నప్ప సినిమాకి ఫుల్ గా ఉంది. సో మంచు విష్ణు కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసి, పర్ఫెక్ట్ క్వాలిటీ అవుట్ ఫుట్ తో సినిమా చేస్తే మాత్రం కన్నప్ప మంచు విష్ణు కెరీర్ కి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ వచ్చేసినట్లే.
Also Read
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
Step into the world of 𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚 where the journey of an atheist Warrior to becoming Lord Shiva’s ultimate devotee comes to life🏹@kannappamovie @24framesfactory @avaentofficial@ivishnumanchu @themohanbabu @Mohanlal @NimmaShivanna #Prabhas#Kannappa🏹 #HarHarMahadevॐ pic.twitter.com/kRbebbZdbH
— Vishnu Manchu (@iVishnuManchu) November 22, 2023
తాజావార్తలు
-
Water Crisis: హైదరాబాద్ కు తాగునీటి ముప్పు..!
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!