Manchu Vishnu: షాకింగ్.. ‘మా’ ప్రెసిడెంట్ కు గాయాలు.. అంతా అతనివలనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Vishnu: మంచు విష్ణు ఒక పక్క హీరోగా మరోపక్క మా ప్రెసిడెంట్ గా రెండు పనులను బాధ్యతగా నిర్వర్తిస్తున్నాడు. ఇక గత కొన్నేళ్లుగా విజయం కోసం ఎంతగానో కష్టపడుతున్నాడు విష్ణు. ఇక ప్రస్తుతం విష్ణు నటిస్తున్న చిత్రం జిన్నా. ఇషాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విష్ణు సరసన హాట్ బ్యూటీస్ సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటున్న ఈ సినిమా సెట్ లో మంచి విష్ణుకు గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని విష్ణు తన సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు.
కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ చెప్పే స్టెప్పులు వేయడం వలనే తనకు గాయాలు అయ్యినట్లు కూడా తెలిపాడు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడినట్లు చెప్పుకొచ్చిన విష్ణు డాన్స్ అదరగొట్టేస్తున్నట్లు తెలిపాడు, కష్టతరమైన స్టెప్స్ నేర్చుకోవడం వలన మోకాలి పై భాగంలో గాయాలు అయ్యినట్లు చెప్పుకొచ్చాడు. అయినా ఆ డాన్స్ స్టెప్పులను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ కు నెటిజన్లు తమదైనరీతిలో స్పందిస్తున్నారు. అన్నా.. నువ్వసలు తగ్గొద్దు. అదిరిపోవాలి సినిమా అని కొందరు.. అంత కష్టపడి చేస్తున్నావ్.. ప్లాప్ అయితే ఫీల్ అవుతావేమో చూడు అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో విష్ణు హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Shubhman Gill: మైదానంలో విలవిలలాడిన గిల్.. నెట్స్‌లో ఊహించని ప్రమాదం.. అభిమానుల్లో పెరిగిన ఆందోళన..
-
The Paradise Teaser: నాని మాస్ విశ్వరూపం.. ‘ది ప్యారడైజ్’తో బాక్సాఫీస్ బద్దలేనా!
-
UK: ఆర్మీ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు.. యూకేను కుదిపేస్తున్న ఘటన..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఫోన్.. ఏం సంభాషణ జరిగిందంటే..!
-
Minister Anitha: జగన్ బయటకు వస్తే విధ్వంసమే.. పరామర్శల పేరుతో అరాచకం.. మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!