Manchu Manoj: మంచు మోహన్ బాబు గురించి మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు, ట్రోలింగ్ కు పర్మినెంట్ అడ్రస్ గా మారిపోయారు. ఇక ఎప్పటినుంచో మంచు బ్రదర్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే అన్నదమ్ముల అన్న తర్వాత గొడవలు ఉండవా అని మోహన్ బాబు చెప్పడంతో నిజమే అనుకొని అభిమానులు లైట్ తీసుకున్నారు.. కానీ, ఎప్పటికప్పుడు విష్ణు- మనోజ్ మధ్య విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. మంచు మనోజ్- భూమా మౌనిక పెళ్లి దగ్గరుండి చేసినందుకు.. విష్ణు, మంచు లక్ష్మీతో కూడా మాట్లాడడం లేదని తెలుస్తోంది. ఇప్పుడు లక్ష్మీ, మనోజ్ ఒక పార్టీ అయితే.. విష్ణు ఒక్కడే ఒక పార్టీ. వీరి మధ్య విబేధాలు ఎలా ఉన్నా కూడా బయటకు రాకుండా మేనేజ్ చేయడంలో మోహన్ బాబు సఫలీకృతమయ్యాడు. కొడుకుల విషయం అయితే కొడుకులతో.. కూతురు విషయమైతే కూతురుతో కనిపిస్తూ.. అసలు ఇంట్లో గొడవలే లేన్నట్లు చెప్పుకొస్తున్నాడు.
Nani: షూటింగ్ లో హీరో నానికి యాక్సిడెంట్?
ఇక సమయం దొరికినప్పుడల్లా.. మనోజ్.. తన అన్న విష్ణుతో గొడవలు ఉన్నట్లు డైరెక్ట్ గానో, ఇన్ డైరెక్ట్ గానో హింట్ ఇస్తూనే ఉన్నాడు. తాజాగా సంపూర్ణేష్ బాబు సోదరా అనే సినిమాకు సంబంధించిన సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో మనోజ్.. అన్నదమ్ముల మధ్య జరిగే గొడవల గురించి మాట్లాడి షాక్ ఇచ్చాడు. “అన్నదమ్ముల బంధం చాలా ముఖ్యమైనది.. ఎప్పుడైతే అన్నదమ్ముల మధ్య ఈగోలు వస్తాయో.. ఇక అంతా అయిపోయినట్లే.. వారి మధ్య ఈగోలు, డబ్బు సమస్యలు ఉండకూడదు. సమస్య ఎక్కడ వస్తుందంటే ఏదైనా గొడవ అయ్యాక వాళ్లిద్దరూ కలిసి కూర్చోని మాట్లాడుకోరు. కాబట్టి ఏ సమస్య ఉన్నా ఎవరో ఒకరు తగ్గి కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి.. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, కుటుంబసభ్యులంతా కలిసి చర్చించుకోవాలి” అని చెప్పుకొచ్చాడు. అంటే ఇన్ డైరెక్ట్ గా మంచు విష్ణుకు ఈ విషయాన్ని చెప్పుకొస్తున్నట్లు తెలుస్తోంది. మరి విష్ణు, తమ్ముడితో రాజీకి వస్తాడా.. ? లేడా.. ? అనేది తెలియాలి.