Manchu Manoj : ‘ఐక్య’ వెనుక ఉన్న అసలు రహస్యం బయటపెట్టిన మనోజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో ప్రయోగాత్మక చిత్రాలకు, డిఫరెంట్ కంటెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రా కింగ్ మంచు మనోజ్.. తన పుట్టినరోజు (మే 20) సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చారు. మంగళవారం మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన ఆయన, తన కొత్త సినిమాలు, సొంతంగా స్థాపించిన ‘ఐక్య’ ట్రస్ట్, అలాగే తన భార్య మౌనిక రాజకీయ అరంగేట్రంపై అనేక ఆసక్తికరమైన, సంచలన విషయాలను పంచుకున్నారు.
‘ఐక్య’.. నా బిడ్డ లాంటిది!
అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండి సాయం చేయాలనే సదుద్దేశంతోనే ‘ఐక్య’ ట్రస్ట్‌ను ప్రారంభించినట్లు మనోజ్ వెల్లడించారు. తన కుమారుడు ‘ధైరవ్’, కుమార్తె ‘దేవ సేన’ పేర్లు కలిసొచ్చేలా, అందరూ కలిసికట్టుగా ఉండాలనే ఉద్దేశంతో ‘ఐక్య ధైర్య సేనా సమితి’ అని నామకరణం చేసినట్లు తెలిపారు. ఈ ట్రస్ట్‌ను తన సొంత బిడ్డలా భావిస్తున్నానని చెప్పారు. ఈ ట్రస్ట్‌కు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని, వాయిస్ లేని వారికి ఇది వాయిస్‌గా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఫండ్ రైజింగ్ ద్వారా నిధులు సేకరించి సేవ చేస్తామన్నారు. ఈ ట్రస్ట్‌కు సంబంధించిన పూర్తి విధివిధానాలను జూన్ 7న అధికారికంగా ప్రకటించనున్నారు.
Also Read
- Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్‌లో అదరగొట్టిందిగా!
- Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
- Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
- MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'మైసా' రిలీజ్ డేట్ లాక్
భార్య రాజకీయ అరంగేట్రంపై క్లారిటీ
మనోజ్ భార్య భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలను ఆయన నిర్ధారించారు. “మేం పుట్టినప్పటి నుంచీ రాజకీయాల్లోనే ఉన్నాం. కొత్తగా రాజకీయాల్లోకి రావడం ఏముంది? వచ్చే ఎన్నికల్లో నా భార్య కచ్చితంగా పోటీ చేస్తారు” అని కుండబద్దలు కొట్టారు. వృత్తిపరమైన జీవితాల్లో ఒకరినొకరు గౌరవించుకుంటామని, ఒకరి నిర్ణయాల్లో మరొకరు జోక్యం చేసుకోబోమని తెలిపారు. అలాగే మౌనిక నేతృత్వంలో నడుస్తున్న ‘నమస్తే వరల్డ్’ టాయ్స్ బ్రాంచ్‌లను త్వరలో బెంగళూరుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించే ప్లాన్‌లో ఉన్నారని వెల్లడించారు.
తాజావార్తలు
-
Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
-
Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
-
AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
-
Team India Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
-
RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్‌న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!