తరచూ వార్తల్లో నిలిచే కుటుంభాలో మంచు ఫ్యామిలీ ముందుంటుంది. ప్రజంట్ చల్లబడినప్పటికి మొన్నటి వరకు ఈ ఫ్యామిలిలో చాలా జరిగాయి. అన్నదమ్ములు ఇద్దరు ఒక్కరంటే ఒక్కరు కొట్టుకునే పరిస్థితికి వచ్చారు. అయితే తాజాగా నటి మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబ జీవితం, ఎదుర్కొన్న సవాళ్లు, విజయాల పట్ల తన మనస్తత్వాన్ని పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ..
Also Read : Akhanda 2 : అఖండ 2 లేటెస్ట్ షూటింగ్ అప్డేట్..
“ఇంట్లో ఎవరు సక్సెస్ సాధించినా, అది అందరికి సంతోషంగా ఉండాలని చూస్తా. నా తండ్రి మోహన్‌బాబు తో కలిసి నటించిన యాక్షన్ చిత్రం దక్ష, సెప్టెంబర్ 19న రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ విజయాలను కూడా సంతోషంగా ఆస్వాదిస్తున్నాను. ‘మిరాయ్’ విజయాన్ని కూడా నేను ఎంజాయ్ చేశాను. కష్టానికి ప్రతిఫలం రాకుండా ఉండాలని నేను ఎప్పుడూ కోరను, ఎందుకంటే ఈ రంగంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఒక ఆర్టిస్ట్‌గా వారి ప్రయాణానికి మార్గదర్శనం అందిస్తాను” అని అన్నారు. అలాగే మంచు లక్ష్మి కుటుంబ గొడవల పై కూడా మాట్లాడారు. “ఒక కుటుంబంలో సమస్యలు ఉంటే, అందరూ బాధపడతారు. కానీ కొన్ని సందర్భాల్లో సైలెంట్‌గా ఉండడం ఉత్తమం అని నేర్చుకున్నాను. గతంలో ఏది సరి, ఏది తప్పు అని ఆలోచించేది, కానీ ఇప్పుడు పరిస్థితులను తట్టుకొని ప్రశాంతంగా ఉండటమే ముఖ్యం అనిపిస్తుంది. జీవితంలో ఏదైనా మనకు పాఠం నేర్పడానికి వస్తుంది. ఈ మనస్తత్వంతోనే నేను ఆనందం, శాంతి పొందగలను” అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి .