Manchu lakshmi: మోహన్ లాల్ తో ఏడాదికో సినిమా చేయాలని ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన ఫిల్మ్ ‘మాన్ స్టర్’. ఈ చిత్రంలో మంచు లక్ష్మి కీలక పాత్రను పోషించింది. మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు ‘వైసక్’ ఈ చిత్రాన్ని రూపొందించారు. థియేటర్ రిలీజ్ ని స్కిప్ చేసిన ఈ మూవీ ‘డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్’ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సంధర్భంగా ‘మాన్ స్టర్’ సినిమా విశేషాల గురించి మంచు లక్ష్మి ఆమె మాట్లాడుతూ….
– ఈ చిత్రంలో నేను ‘మంజు దుర్గ’ అనే పాత్రలో నటించాను. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు చెప్పిన క్యారెక్టర్ చెప్పినట్లు రూపొందిస్తారా లేదా అనే అనుమానం ఉండేది. ఎందుకంటే స్క్రిప్ట్ దశలో చెప్పిన క్యారెక్టర్ చివరకు సినిమాలో ఉండదు. లక్కీగా నా క్యారెక్టర్ వరకూ ఎలాంటి సీన్స్ తీసేయలేదు.
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
– మలయాళంలో నటిస్తున్నప్పుడు భాష పరంగా ఇబ్బందులు పడ్డాను. ఆ డైలాగ్స్ మనలా ఉండవు, చాలా లెంగ్తీ డైలాగ్స్ ఇచ్చారు. నేను చాలా ఎనర్జిటిక్ గా సెట్స్ కు వెళ్తే, డల్ గా ఉండాలి మీ క్యారెక్టర్ అని చెప్పేవారు. ఈ పాత్ర మూడ్ ను, లాంగ్వేజ్ ను అర్థం చేసుకునేందుకు కొంత టైమ్ పట్టింది.
– మోహన్ లాల్ ఒక లెజెండరీ నటుడు. ఆయన నటుడిగానే కాక బహుముఖ ప్రజ్ఞాశాలి. తెరపై ఎన్నో ప్రయోగాలు చేశారాయన. ఇప్పటికీ తన కెరీర్ లో ఛాలెంజింగ్ మూవీస్ చేస్తున్నారు. మీతో సంవత్సరానికి ఒక సినిమాలో అయినా నటించాలని ఉందని నేను ఆయనతో అన్నాను. కెరీర్ లో ఇప్పుడు ఆయన ఉన్న స్జేజ్ లో నాకెందుకు ఇలాంటి వివాదాస్పద సబ్జెక్ట్ అనుకోవచ్చు కానీ ఆయన సవాళ్లు స్వీకరిస్తారు.
– నా దృష్టిలో ప్రేమకు లింగ, ప్రాంత, కుల, మత బేధాలు లేవు. ఎవరైనా ఇద్దరి మనుషుల మధ్య ప్రేమ ఉండొచ్చు. ఫలానా వ్యక్తినే ప్రేమించాలని చెప్పే హక్కు ఎవరికీ లేదు.
– ట్రోల్స్ ను, మీమ్స్ ఎంజాయ్ చేస్తుంటా. వాళ్లకు ఇంకేదేనా కొత్తగా క్రియేట్ చేసేందుకు క్లూ ఇవ్వాలని చూస్తుంటా. నటిగా కంటే టీవీ కార్యక్రమాల్లో నన్ను నేనుగా ప్రేక్షకులకు చూపించుకోగలుగుతాను. ప్రస్తుతం ‘గాంబ్లర్’, ‘లేచింది మహిళా లోకం’, ‘అగ్ని నక్షత్రం’ తదితర చిత్రాల్లో నటిస్తున్నాను” అని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?