టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష్మీ ఇటీవల ‘ది మేల్ ఫెమినిస్ట్’ అనే పాపులర్ పోడ్‌కాస్ట్‌లో పాల్గొని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తన వ్యక్తిగత అనుభవాలు, సినీ కెరీర్, మహిళలు ఎదుర్కొనే సామాజిక ఒత్తిళ్లు వంటి కీలక విషయాలను ఆమె ఈ ఇంటర్వ్యూలో అన్‌ఫిల్టర్డ్‌గా వెల్లడించింది. మీటూ ఉద్యమంపై మాట్లాడిన మంచు లక్ష్మీ, తాను కూడా ఇండస్ట్రీలో కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొన్నానని తెలిపింది. “నేను స్టార్‌కిడ్‌నని ఎలాంటి ఇబ్బందులు రాలేదనుకోవడం పెద్ద పొరపాటు. కొన్ని సంఘటనలు విన్న ప్రతిసారీ రాత్రిళ్లు ఏడ్చేదాన్ని” అని భావోద్వేగంగా చెప్పింది. ఈ వ్యాఖ్యలు మహిళలు పరిశ్రమలో ఎదుర్కొనే వాస్తవాలను గుర్తు చేసేలా ఉన్నాయి.
Also Read : Kajol & Twinkle : మేమిద్దరం ఓకే హీరోతో డేట్ చేశాం.. స్టార్ హీరోయిన్స్ బోల్డ్ కామెంట్స్
ఇక, ఫిల్మ్ కల్చర్ విషయానికి వస్తే సౌత్–నార్త్ ఇండస్ట్రీల మధ్య తేడాలను ఆమె స్పష్టంగా చెప్పింది. డ్రెస్‌పై వచ్చే విమర్శలను సమాధానపరుస్తూ, “కొన్ని సీన్స్‌లో బొడ్డు కనిపిస్తే తప్పా? అది ఆర్ట్, లుక్ రిక్వైర్మెంట్. కానీ మన సమాజం మహిళల శరీరాన్ని తప్పుగా చూస్తుంది” అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. సౌత్‌లో సంప్రదాయ పేరుతో ఉన్న ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, నార్త్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తుందని కూడా వ్యాఖ్యానించింది.
కాస్మెటిక్ సర్జరీ పై వచ్చిన విమర్శలను కూడా లక్ష్మీ తిప్పికొట్టింది. “సర్జరీ చేయించుకోవడం వ్యక్తిగత నిర్ణయం. మహిళలు మాట్లాడటానికే భయపడే సమాజాన్ని మార్చాల్సిన సమయం వచ్చింది” అని తెలిపింది. హాలీవుడ్ అనుభవాన్ని గుర్తు చేస్తూ, అక్కడి వర్క్ కల్చర్, గౌరవం, సమయపాలన టాలీవుడ్‌తో పోలిస్తే చాలా మెరుగైందని పేర్కొంది. అలాగే సెక్స్ ఎడ్యుకేషన్‌పై మాట్లాడుతూ.. అమెరికాలో స్కూల్ స్థాయిలోనే దీనికి ప్రాధాన్యం ఇస్తారని, కానీ భారత్‌లో ఈ విషయాలపై మాట్లాడటం కూడా తప్పుగా చూస్తారు అని ఆమె అభిప్రాయపడింది. మొత్తానికి మంచు లక్ష్మీ చెప్పిన ప్రతి అంశం ఇండస్ట్రీ వాస్తవాలను, సమాజపు పాత మనోభావాలను, మహిళలు ఎదుర్కొనే సమస్యలను నేరుగా వెలుగులోకి తెచ్చింది. ఆమె అన్‌ఫిల్టర్డ్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.