Chiranjeevi: సంక్రాంతి ముందే ‘మెగా’ సునామీ: లక్షల్లో చిరు సినిమా టికెట్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలవ్వకముందే.. ‘మెగా’ మేనియా మొదలయ్యింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, అభిమానుల ఆనందం ఆకాశాన్ని తాకుతోంది. కేవలం థియేటర్ల దగ్గర కటౌట్లు, పాలాభిషేకలకే పరిమితం కాకుండా, ఈసారి టికెట్ల వేలంతో కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు మెగా అభిమానులు. మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు ప్రేక్షకులకు ఒక ఎమోషన్, ఆయన వెండితెరపై కనిపిస్తే వచ్చే పూనకాలు వేరు. ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా కోసం అభిమానులు ఏకంగా లక్షలు వెచ్చించి టికెట్లు కొనుగోలు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. తాజాగా కోనసీమ జిల్లా అమలాపురంలో మెగా ఫ్యాన్స్ నిర్వహించిన తొలి టికెట్ వేలంలో రికార్డు స్థాయి ధర పలికింది. ఈ వేలంలో ఒక బీజేపీ నాయకుడు ఏకంగా రూ. 1,11,111 (లక్షా పదకొండు వేల నూట పదకొండు రూపాయలు) వెచ్చించి సినిమా తొలి టికెట్‌ను సొంతం చేసుకున్నారు, తన అభిమాన హీరో సినిమాను ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడాలనే ఆరాటంతో ఆయన ఈ స్థాయి ధరకు వెనుకాడలేదు.
Also Read: Mega 158: సర్జరీ ఎఫెక్ట్.. మారిన మెగా ప్లాన్?
Also Read
- Ameesha Patel: ‘ఆంటీ’ అంటూ ట్రోల్.. హార్దిక్‌తో లింకప్ రూమర్స్‌పై అమీషా స్ట్రాంగ్ కౌంటర్!
- Toxic OTT : రూ. 150 కోట్ల నుండి రూ. 30 కోట్లకు పడిపోయిన టాక్సిక్ OTT ఆఫర్!
- Toxic: యశ్ ‘టాక్సిక్’లో ఈ 9 ఏళ్ల బుడ్డోడు ఎవరో తెలుసా? రాకీ భాయ్ ఇచ్చిన గిఫ్ట్‌ల వెనుక అసలు కథ ఇదే!
- The Paradise : సెప్టెంబర్ 24న ప్యారడైజ్ రిలీజ్ ఫిక్స్.. చుట్టేస్తున్నారా?
మరోవైపు నరసాపురంలోని ప్రముఖ థియేటర్ ‘అన్నపూర్ణ’లో జరిగిన వేలం కూడా మొదటి టికెట్ ధర రూ. 1,02,000 (లక్షా రెండు వేలు) పలికింది. ఒక సామాన్యమైన సినిమా టికెట్ ఈ స్థాయిలో ధర పలకడం మెగాస్టార్ క్రేజ్‌కు నిదర్శనమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును అభిమానులు తమ సొంతానికి వాడుకోకుండా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు, అదేమంటే వేలంలో పోగైన ఈ భారీ మొత్తాన్ని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ (CCT)కు విరాళంగా ఇవ్వనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. చిరంజీవి తన సినిమాల ద్వారానే కాకుండా, బ్లడ్ బ్యాంక్ మరియు ఐ బ్యాంక్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలకు తమ వంతు మద్దతుగా ఈ విరాళం అందజేస్తున్నట్లు తెలిపారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాలోని వింటేజ్ చిరు మార్క్ కామెడీని, యాక్షన్‌ను గుర్తుచేస్తున్నాయి.
తాజావార్తలు
-
Ameesha Patel: ‘ఆంటీ’ అంటూ ట్రోల్.. హార్దిక్‌తో లింకప్ రూమర్స్‌పై అమీషా స్ట్రాంగ్ కౌంటర్!
-
TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
-
Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు.!
-
Auto Drivers Meet: ఆటో కార్మికులతో కీలక భేటీ.. సంక్షేమ బోర్డు, మీటర్ ఛార్జీలపై చర్చ!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!