Malvi Malhotra comments on Lavanya issue: రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. అనేక వివాదాలు రాజ్ తరుణ్ చుట్టూ ముసురుకుంటున్న సంగతి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే రాజ్ తరుణ్ హీరోగా మాల్వి మల్హోత్రా హీరోయిన్గా తెరకెక్కిన తిరగబడరా సామి సినిమా ఈరోజు రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా ముచ్చటించింది మాల్వి మల్హోత్రా. ఈ సందర్భంగా తన మీద వచ్చిన ఆరోపణల మీద ఆమె స్పందించింది. నిజానికి ప్రస్తుతానికి తాను పోలీసులకు ఫిర్యాదు చేశాను కాబట్టి ఈ విషయాల మీద స్పందించను అంటూనే తాను మాధవ్ హోటల్లో కానీ గ్రీన్ పార్క్ హోటల్ లో కానీ బస చేయలేదని చెప్పుకొచ్చింది.
Love Harassment: ప్రేమ పేరుతో వేధింపులు.. మైనర్ బాలిక ఆత్మహత్య..
అలాగే కొన్ని చాట్స్ ఏవైతే లావణ్య చూపిస్తుందో అవన్నీ ఫ్యాబ్రికేట్ చేయబడిన చాట్స్ అని ఆమె ఆరోపించింది. లావణ్య ఆరోపణల మీద నేను స్పందించాల్సిన అవసరం లేదు ఆమె చేస్తున్న అన్ని పనుల మీద నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. అయితే మన జ్యూడిషియల్ సిస్టం గురించి మీకు తెలిసిందే కదా నిజా నిజాలు బయటకు రావాలంటే కాస్త సమయం పడుతుంది. వెయిట్ చేయండి అంటూ మాల్వి మల్హోత్రా చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ తనను నమ్మించి ప్రేమించి ఒంటరిగా ఉన్నప్పుడు వివాహం కూడా చేసుకుని ఇప్పుడు వదిలేసి వెళ్లిపోయాడని లావణ్య ఆరోపిస్తోంది. తనకు పలుసార్లు గర్భస్రావం కూడా చేయించాడనే ఆరోపణలు చేస్తోంది లావణ్య. దీనంతటికీ కారణం మాల్వి మల్హోత్రా అని ఆమె మాయలో పడి తనను రాజ్ తరుణ్ దూరం పెట్టాడని అంటోంది.