రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలో మలయాళ నటుడు సురేశ్ గోపి విలన్ గా నటించబోతున్నాడట. ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయిక. తెలుగులో శంకర్ తీస్తున్న తొలి చిత్రమిది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. కథ నచ్చి విలన్ గా నటించటానికి సురేశ్ గోపి అంగీకరించినట్లు సమాచారం.
Read also : ‘ఐకాన్’ మళ్ళీ ఆగనుందా!?
బాలీవుడ్ నటి ఈషా గుప్తా కూడా ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించనున్నట్లు వినికిడి. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్, అంజలి, జయరామ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి రచయిత. థమన్ సంగీతం అందించనున్న ఈ సినిమాకు తిరు సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నారు.