Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి మాళవిక షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి ది రాజాసాబ్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హీరోయిన్ మాళవిక మోహనన్ ప్రభాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రభాస్ గురించి బయట విని నిజంగా అతను చాలా సైలెంట్ గా ఉంటాడేమో.. ఎలా మాట్లాడాలి అనుకుంటూ అనుకున్నాను. కానీ నా అంచనాలు పూర్తిగా ఫెయిల్ అయింది. ఎందుకంటే ప్రభాస్ చాలా సింపుల్ గా అందరికీ సరదాగా ఉంటారు. అంత పెద్ద స్టార్ అయినా సరే ఎలాంటి ప్రౌడ్ ఉండదు.
Read Also : Pak spy: పాక్ గూఢచారికి సహకరిస్తున్న హెల్త్ వర్కర్ అరెస్ట్..
అందరితో కలిసి సరదాగా మాట్లాడుతూ కనిపిస్తారు. ఆయన సెట్ లో ఉన్నంత సేపు సందడిగా ఉంటుంది. అస్సలు బోర్ కొట్టదు. జోక్స్ వేసి నవ్విస్తారు. ఎలాంటి వారిని అయినా ఒకే విధంగా పలకరిస్తారు’ అంటూ చెప్పుకొచ్చింది మాళవిక. త్వరలోనే రాజాసాబ్ టీజర్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి’ అంటూ తెలిపింది ఈ బ్యూటీ.
మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ టైమ్ ఇందులో ప్రభాస్ హర్రర్ సినిమాలో కనిపిస్తున్నారు. రీసెంట్ గానే డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయింది. త్వరలోనే టీజర్ వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గానే హాలిడే ట్రిప్ నుంచి ప్రభాస్ ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే. వచ్చిన వెంటనే రాజాసాబ్ పనుల్లో బిజీగా గడుపుతున్నాడంట.
Read Also : Anusree Satyanarayana: పవన్ సినిమా ఆపే ధైర్యం ఎవరికి లేదు.. ఏపీలో సినిమా థియేటర్ల బంద్ లేదు..