Malavika Mohanan: ‘మాస్టర్’ బ్యూటీ కన్ను కూడా రౌడీ హీరోపైనేనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్టర్ సినిమాతో అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో కుర్రకారుకు క్రష్ లిస్టులోకి చేరిపోయింది మాళవిక మోహనన్. ఈ సినిమా తరువాత కోలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకున్న బ్యూటీ ఇటీవలే ధనుష్ సరసన మారన్ లో కనిపించి మెప్పించింది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. అమ్మడి అందం మెస్మరైజ్ చేసేలా ఉండడంతో ఫాలోవర్స్ కూడా అంతకంతకు పెరుగుతూనే ఉన్నారు. ఇక కొంచెం గ్యాప్ దొరికినా మాళవిక అభిమానులతో టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ #AskMalavika అంటూ అభిమానులతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.అభిమానుల ప్రశ్నలకు ఎంతో ఓపిగ్గా సమాధానం ఇచ్చింది. ఇక ఈ సెషన్ లో చాలామంది తమ ఫెవరేట్ హీరోల గురించి చెప్పాలని అడుగగా.. మరికొందరు “మీ డ్రీమ్ రోల్ ఏంటి..? తమిళ బిగ్ స్టార్స్ అయిన రజనీకాంత్ విజయ్ లతో కలిసి నటించారు. ఇప్పడు ఎవరితో కలిసి నటించాలని ఎదురుచూస్తున్నారు?” అని అడిగారు.
ఇక వీటికి సమాధానంగా తన మనసులో మాటను బయటపెట్టింది హాట్ బ్యూటీ.. తనకు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో నటించాలని ఉందని చెప్పుకొచ్చింది. “విజయ్ దేవరకొండ తో కలిసి రొమాంటిక్ లేదా రోమ్ కోమ్ సినిమా చేయాలని ఉంది” అని చెప్పుకొచ్చింది. దీంతో రౌడీ హీరో లిస్ట్ లోకి ఇంకో హీరోయిన్ యాడ్ అయ్యింది. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ, జాన్వీ కపూర్ లాంటి ముద్దుగుమ్మలు విజయ్ తో నటించాలని ఉందని చెప్పి షాక్ ఇచ్చారు. ఇక తాజాగా ఈ కోలీవుడ్ బ్యూటీ కన్ను కూడా రౌడీ హీరోపైనే ఉందని తెలిసిపోయింది. నిజం చెప్పాలంటే విజయ్ తో నటించే అవకాశం మాళవిక ముందే కొట్టేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు విజయ్, మాళవిక జంటగా హీరో అనే సినిమాను లైన్లో పెట్టారు. అయితే కొన్ని కారణాల వలన అది పట్టాలెక్కలేదు. మరి ఈసారి అయిన ‘మాస్టర్’ బ్యూటీ కల నెరవేరుతుందో లేదో చూడాలి.
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
Really want to act in a romantic or rom com movie with Vijay Deverakonda 🙂 https://t.co/jWAN9QSn8e
— Malavika Mohanan (@MalavikaM_) May 18, 2022
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్‌లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!