బాలీవుడ్ స్టార్ కపుల్ అర్జున్ కపూర్, మలైకా అరోరాల ప్రేమ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్నేళ్లుగా ఈ హాట్ బ్యూటీ నిరంతరం వార్తల్లోకి ఎక్కుతుంది అంటే అందుకు ప్రధాన కారణం.. అర్జున్ కపూర్ తో అమ్మడి రిలేషనే.. మలైకా వయస్సు 48, అర్జున్ వయస్సు 36.. దాదాపు ఇద్దరి మధ్య 12 ఏళ్లు గ్యాప్. అయినా ఇద్దరు రిలేషన్ లో ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. కానీ వీరే రిలేషన్ ను సమాజం మాత్రం అంగీకరించడం లేదు. దీంతో మలైకా పై నిత్యం ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ఈ ట్రోల్ల్స్ పై మలైకా మరోసారి స్పందించింది.
” నేను విడాకులు తీసుకున్నాకా అర్జున్ తో డేటింగ్ ప్రారంభించాను. ఆడవారు యువకులతో డేటింగ్ చేస్తే ఎందుకు సమాజం ఎత్తి చూపిస్తుంది. బ్రేకప్ లేదా విడాకుల తర్వాత మహిళలు జీవితం తమకిష్టమైనట్లు బ్రతకకూడదా..? అస్సలు 12 ఏళ్ళు చిన్నవాడైన కుర్రాడితో డేటింగ్ చేస్తే తప్పేంటి..? అది వారిద్దరి పర్సనల్ విషయం.. ఒక స్వతంత్రమైన మహిళ ఎలాంటి నిర్ణయాన్ని అయినా తీసుకోగలదు. ఒక స్త్రీ యువకుడితో డేటింగ్ చేయడం తరచుగా అపరాధంగా పరిగణనలోకి తీసుకొని ఎత్తి చూపడం పద్దతి కాదు. నేను నా తల్లిలా జీవించాలనుకుంటున్నాను. ఆమె స్వతంత్రురాలు. నన్ను కూడా అలాగే పెంచింది. నాకు ఆమె దైర్యం, శక్తి వచ్చాయి. నేను ఆమెకు ప్రతి బింబం” అని చెప్పుకొచ్చింది. ఇకనైనా ఇలాంటి ట్రోల్స్ ని మానుకోమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అమ్మడు మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే మలైకా .. సల్మాన్ ఖాన్ అన్న అర్బాజ్ ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్నేళ్ల తరువాత విడిపోయిన విషయం విదితమే.