Bollywood : 51 ఏళ్ల వయసులో.. రెండో పెళ్లికి రెడీ అయిన హాట్ హీరోయిన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్లో అందం, స్టైల్, ఫిట్నెస్కి సింబల్‌గా నిలిచిన మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 50 ఏళ్ల వయసు దాటిన, ఆమె గ్లామర్ & ఎనర్జీ ఇప్పటికీ యువ నటీమణులకు సైతం టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. ముఖ్యంగా ఐటెం సాంగ్స్‌తో ఆమెకి ఉన్న పాపులారిటీ వేరే లెవెల్లో ఉంటుంది. 1998లో విడుదలైన దిల్ సె చిత్రంలోని “చయ్యా చయ్యా” సాంగ్‌తో మలైకా ఒక్కరాత్రిలో స్టార్ అయింది. తర్వాత కాంటేలో “మహి వే”, దబాంగ్‌లో “మున్నీ బద్నామ్”, దబాంగ్ 2లో “పాండే జీ సీటీ” వంటి సూపర్‌హిట్ సాంగ్స్‌లో తన డ్యాన్స్‌తో అలరించింది. తెలుగులో కూడా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో “కెవ్వు కేక” పాటతో బ్లాస్టింగ్ రెస్పాన్స్ అందుకుంది.
Also Read : Maareesan: ఫహాద్ ఫాజిల్ నటించిన కామెడీ థ్రిల్లర్.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
Also Read
- Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
- Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
- Dil Raju: రాకింగ్ స్టార్ యశ్‌తో దిల్ రాజు సినిమా కన్ఫర్మ్.. కానీ!
- Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
పర్సనల్ లైఫ్‌లో, మలైకా నటుడు అర్బాజ్ ఖాన్ ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కానీ 2017లో వీరి దాంపత్య జీవితం విడాకులతో ముగిసింది. ఆ తర్వాత ఆమె తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన హీరో అర్జున్ కపూర్ తో లవ్ రిలేషన్లో ఉన్నారు. ఇద్దరూ వెకేషన్లు, ఈవెంట్లలో కపుల్ గోల్స్ సెటప్ చేసినా, తాజాగా వీరిద్దరూ బ్రేకప్ అయ్యారన్న వార్తలు వెలువడుతున్నాయి. ఇంతలోనే మలైకా కొత్తగా ఒక తాజా ఇంటర్వ్యూలో తన రెండో పెళ్లిపై ఓపెన్ అయ్యారు. విడాకుల తర్వాత చాలా విమర్శలు ఎదుర్కొన్నానని, కానీ ఆ అనుభవమే తనను మరింత బలంగా మార్చిందని చెప్పారు. “నేను హార్డ్‌కోర్ రొమాంటిక్‌ని.. ప్రేమను నమ్ముతాను. సరైన వ్యక్తి దొరికితే ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటాను” అంటూ స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం ఆమె ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారాయి. మరి మలైకా జీవితంలో కొత్త చాప్టర్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!