PM Modi: బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 50 ఏళ్ళ వయస్సులోనూ కుర్రకారుకు కునుకు పట్టనివ్వకుండా గ్లామర్ ను మైంటైన్ చేస్తోంది. ప్రస్తుతం అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తున్న ఈ బ్యూటీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. మలైకాతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఒక స్టేజ్ మీద ప్రధాని మోడీతో మలైకా పిచ్చాపాటీ ముచ్చట్లు చెప్తోంది. ఏంటి నిజమా..? మోడీ ని మలైకా ఎందుకు కలిసింది..? అసలు ఎక్కడ కలిశారు అని టెన్షన్ పడకండి. అందులో ఉన్నది అసలు మోడీనే కాదు.. సడెన్ గా ఆయనను చూస్తే మోడీ అని అనుకోక మానరు.
ఇది ఒక షో ప్రారంభంలో జరిగినట్లు తెలుస్తోంది. అచ్చు గుద్దినట్లు మోడీలా ఉన్న వ్యక్తి, మలైకాతో మాట కలిపాడు. ఆమెతో కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. కొద్దిగా జాగ్రత్తగా గమనిస్తే తప్ప అది మోడీ కాదు అన్న విషయం తెలుస్తోంది. ఆ సూట్, హెయిర్ స్టైల్, స్పెక్ట్స్ అన్ని మోడీనే గుర్తుచేస్తుండడంతో పొరపాటు పడడం పరిపాటి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ వీడియోపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఓరిని.. ఒక్కసారిగా చూసి మలైకాతో మోడీ ఏం చేస్తున్నాడా..? అనుకున్నా కదా అని కొందరు అంటుండగా.. మోడీకి కార్బన్ కాపీలా ఉన్నాడు ఎవరు ఇతను అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.