Mahesh NTR: ఒక్కరోజు గ్యాప్‌లో డిజిటల్ రికార్డ్స్ బద్దలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ఏ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ తీసుకున్న సరే… రెండే రెండు కనిపిస్తున్నాయి. ఒకటి మహేష్‌బాబు ‘గుంటూరు కారం’, రెండోది ఎన్టీఆర్ ‘దేవర’. గుంటూరు కారం రిలీజ్‌కు మరో వారం రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడప్ చేసిన మేకర్స్… జనవరి 6న గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అదే రోజు గుంటూరు కారం నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తున్నారు. ఇప్పటి వరకు బయటికి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌ని ఓ రేంజ్‌లో ట్రెండ్ చేశారు. అలాంటప్పుడు ట్రైలర్ రిలీజ్ అయిన రోజు… అది కూడా ఈవెంట్ రోజు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. జనవరి 6న సోషల్ మీడియాలో మహేష్ బాబు నామ స్మరణ జరగడం పక్కా. అలాగే ట్రైలర్‌తో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడానికి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. అయితే… మహేష్ ఫ్యాన్స్ కంటే డబుల్ జోష్‌లో ఉన్నారు యంగ్ టైగర్ ఫ్యాన్స్.
గుంటూరు కారం ట్రైరల్ రిలీజ్ అయిన తర్వాత… ఒక్క రోజు గ్యాప్‌లో జనవరి 8న మోస్ట్ అవైటేడ్ దేవర గ్లింప్స్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు కొరటాల శివ. గుంటూరు కారం కంటెంట్ పై కాస్త అయిన క్లారిటీ ఉంది కానీ… దేవర నుంచి వస్తున్న ఫస్ట్ గ్లింప్స్ ఇదే. దీంతో దేవర వరల్డ్ ఎలా ఉంటుందనే ఎగ్జైట్మెంట్ అందిరలోను ఉంది. అందుకే… దేవరను టాప్‌లో ట్రెండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. దేవర గ్లింప్స్ బయటికి రావడమే లేట్… డిజిటల్ రికార్డ్స్ అన్ని చెల్లా చెదురు చేస్తామని టైగర్ ఫ్యాన్స్ కాచుకొని కూర్చుకున్నారు. ఇదే జోష్‌ను కంటిన్యూ చేస్తూ… ఘట్టమనేని ఫ్యాన్స్ జనవరి 12 కోసం వెయిట్ చేస్తుండగా… నందమూరి అభిమానులు ఏప్రిల్ 5 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మొత్తంగా… జనవరి 6, 8 తేదీల్లో మాత్రం మహేష్, ఎన్టీఆర్ దెబ్బకు సోషల్ మీడియా క్రాష్ అయిపోవడం గ్యారెంటీ.
Also Read
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
తాజావార్తలు
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!