Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్‌డేకు భారీ సర్ప్రైజ్?
- మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వారణాసి
- ప్రియాంక చోప్రా వారణాసి లుక్ రిలీజ్
- మహేశ్ బాబు బర్త్‌డేకు భారీ సర్ప్రైజ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Babu Fans expecting Varanasi Glimpse on August 9: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ పాన్ వరల్డ్ మూవీపై అభిమానుల్లో రోజురోజుకూ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. నేడు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పుట్టినరోజు సందర్భంగా సినిమా సెట్లోని ఫొటోలను రిలీజ్ చేశారు. ‘ఆమె నవ్వితే అందం. నవ్వకపోతే నిప్పు కణిక’ అని డైరెక్టర్ రాజమౌళి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రియాంక చోప్రా ఫొటోస్ రిలీజ్ నేపథ్యంలో సోషల్ మీడియాలో మరోసారి ఆసక్తికర ప్రచారం మొదలైంది. మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న వారణాసి తొలి గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు అభిమానులు, ఫ్యాన్ పేజీలు పెద్ద ఎత్తున పోస్టులు చేస్తూ హల్చల్ చేస్తున్నాయి. ‘బాబు బర్త్‌డేకు భారీ సర్ప్రైజ్’, ‘బాబు బర్త్‌డేకు గ్లింప్స్ లోడింగ్’. ‘ఆగస్టు 9న ఇంతకుముందెన్నడూ చూడని హైప్ చూడబోతున్నారు’ అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు షేర్ చేస్తున్నారు. దీంతో #Varanasi, #MaheshBabu హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి.
Also Read
- “ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
- Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
- Mirzapur The Movie: 14వ రోజూ దుమ్మురేపిన 'మీర్జాపూర్: ది మూవీ'.. రూ.300 కోట్ల క్లబ్‌కు అడుగు దూరంలో!
- Zombie Reddy 2: తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో మైండ్ బ్లాక్ చేస్తున్న ఉపేంద్ర ఫస్ట్ లుక్ పోస్టర్!
ప్రియాంక చోప్రా బర్త్‌డే నాడు ఓ అప్డేట్ ఇచ్చారంటే.. పక్కాగా ఆగస్టు 9న భారీ సర్ప్రైజ్ ఉండనుంది. నిజంగానే గ్లింప్స్ రిలీజ్ అయితే.. మహేశ్ బాబు అభిమానులకు భారీ బర్త్‌డే కానుకగా నిలవనుంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న వారణాసి చిత్రం పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఈ సినిమాలో రుద్ర, శ్రీరాముడిగా మహేశ్ డబుల్ రోల్ చేస్తున్నారు.
Ready avandi Amma … Babu birthday ki Glimpse Confirm 🥵🥵🥵🥵🥵🥵🥵🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
August 9 th ❤️🔥🔥🔥🔥#Varanasi #MaheshBabu pic.twitter.com/xA0KmS5Aw3
— MaheshCult🔱 #RudhraNation (@DumMasala_009) July 18, 2026
Priyanka Birthday ki First look reveal chesaru ante… Babu birthday ki ready aipoindi raa GLIMPSE LOADING 🌋🥵🚩
Mi brathuklo eppudu chudani hype chustharu @ssrajamouli @ssk1122 🥵#Varanasi #MaheshBabu pic.twitter.com/GoNnjxt0ti
— Abhi DHFM (@AbhiDHFM981975) July 18, 2026
తాజావార్తలు
-
BCCI కీలక నిర్ణయాలు.. లైంగిక వేధింపులపై కొత్త కమిటీ, IPL 2027పై ఫోకస్
-
Indonesia: వివాహేతర సంబంధం.. మహిళకు 100 కొరడా దెబ్బలు శిక్ష.. దయ చూపండంటున్నా..
-
Supreme Court: పరీక్షా సంస్కరణలపై సుప్రీంకోర్టు విచారణ.. ఎన్టీఏ ఆఫీస్‌ను సందర్శించే అవకాశం
-
Mivi One 5G: ఫోన్ రిపేర్ అయితే చేతికి కొత్త ఫోన్.. మార్కెట్లోకి అద్భుత ఫీచర్లతో నయా ఫోన్.. 24న లాంచ్..
-
“ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..