సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” సినిమా గోవా షెడ్యూల్‌ను పూర్తి చేసారు. ఈ హీరో తన కుటుంబం, సోదరి మంజుల, స్నేహితురాలు, స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో కలిసి ఈ రోజు ఉదయం చార్టర్డ్ విమానంలో హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. 2 వారాల పాటు జరిగిన సుదీర్ఘ షెడ్యూల్‌లో దర్శకుడు పరశురామ్ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, మహేష్, కీర్తిలతో పాటు ఇతర ప్రధాన నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ సెప్టెంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌లో జరుగుతుంది.
Read Also : మిస్టర్ బైడెన్… చెప్పు తెగుద్ది ఎదవ : నిఖిల్
యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం విడుదల కానుంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” పేరుతో విడుదలైన ఈ బ్లాస్టర్ కు రికార్డు బ్రేకింగ్ వ్యూస్ వచ్చాయి.