Namrata Shirodkar: నమ్రతా శిరోద్కర్.. గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఘట్టమనేని ఇంటి కోడలిగా, సూపర్ స్టార్ మహేష్ భార్యగా ఆమె ఎన్నో బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తిస్తుంది. భర్త మహేష్ కు సంబంధించిన అన్ని విషయాలను ఆమె దగ్గర ఉండి చూసుకుంటూ ఉంటుంది. ఇక మరోపక్క ఇద్దరు పిల్లలకు తల్లిగా వారిని ప్రేమతో పెంచుతోంది. నమ్రత ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. మహేష్ తో పెళ్లి తరువాత ఆమె ఎప్పుడూ సినిమాల వైపు తిరిగి చూసింది లేదు. తన కుటుంబాన్ని చూసుకోవడమే తనకు ఆనందం అని చెప్తూనే ఉంటుంది. మరోసారి తన కుటుంబం గురించి, సినిమాలో రీ ఎంట్రీ గురించి చెప్పుకొచ్చింది నమ్రత.. మహేష్ అక్క మంజుల ఒక యూట్యూబ్ ఛానెల్ ను రన్ చేస్తున్న విషయం విదితమే.ఇక మంజుల గురించి నమ్రత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది. “నేను చేసిన సినిమాలు అన్నీ నా పరిధిలో చేసినవే.. ఇప్పుడు సినిమాలు చేయడం లేదే అనే బాధ నాలో కొంచెం కూడా లేదు. మళ్లీ సినిమాల్లోకి రావాలని కూడా లేదు. నా కుటుంబ బాధ్యతలను మోయడం నాకు ఎంతో ఇష్టం. జీవితం ఇలా సాగిపోతోంది. చిన్నతనంలో నేను ఎయిర్ హోస్ట్రెస్ అవ్వాలనుకున్నాను. కానీ.. ప్రమాదాలు జరుగుతాయని మా అమ్మ నన్ను అటువైపు వెళ్లనివ్వలేదు.
ఇక సినిమా ఫీల్డ్, పెళ్లి, పిల్లలు.. ఇలా కొనసుగుతోంది నా జీవితం.. అయితే ఇంట్లో కూర్చుంటే చాలా బోర్ గా ఉంది. అందుకే టీవీ నిర్మాణ రంగంలో భాగమయ్యాను. మంచి కంటెంట్ దొరికితే దానిని నిర్మించి ప్రేక్షకులకు అందించాలనుకుంటున్నాను. ఇక నా ఆడపడుచు మంజుల అంటే నాకు చాలా ఇష్టం. మేము ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. మొదటిసారి ఆమెను నేను పార్టీలో చూశాను. అప్పటికి.. నేను, మహేష్ ప్రేమలో ఉన్నట్లు ఆమెకు తెలియదు. ఆ తరువాత మహేష్, నేను ఒక్కటయ్యాం. మంజుల, నేను ఒకేసారి ప్రెగ్నెంట్ అయ్యాం. అది యాదృచ్ఛికమో, దేవుని సంకల్పమో తెలియదు. కానీ.. అప్పుడు మంజులకు పిల్లలను కనడం ఇష్టం లేదు. ఇప్పుడు ఒక బిడ్డకు తల్లిగా ఎంతో అందంగా కనిపిస్తోంది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నమ్రత వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.