సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చే ఏడాది అభిమానులకు విందు భోజనమే సిద్ధం చేసినట్లు కనిపిస్తున్నాడు. ఇప్పటికే పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాదికి రిలీజ్ డేట్ ప్రకటించిన మహేష్ ఈ సినిమా తరువాత వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ఇకపోతే సర్కారు వారి పాట తరువాత రాజమౌళి కాంబోలో మహేష్ సినిమా మొదలవుతుంది అనుకొనేలోపు .. మహేష్- త్రివిక్రమ్ తో కాంబో సెట్ చేసేశాడు. అతడు, ఖలేజా తరువాత రిపీట్ అవుతున్న కాంబో కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో త్రివిక్రమ్ దర్శకుడిగా మహేశ్28 త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ ఇవ్వనున్నాడు.
ఇక తాజగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మహేష్ బాబు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అభిమానులతో పంచుకున్నారు. త్రివిక్రమ్, థమన్, నాగవంశీ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ” వర్క్ అండ్ ఛిల్ల్.. ఈ మధ్యాహ్నం ఈ టీమ్ తో పనులు సాగుతున్నాయి” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ మీటింగ్ దుబాయ్ లో జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.మరి మహేష్- త్రివిక్రమ్ హ్యాట్రిక్ మూవీ ఏ విధంగా ఉండబోతుందో చూడాలి.
#SSMB28 ✨🌟 https://t.co/aC9Tz3dYDj
— Haarika & Hassine Creations (@haarikahassine) December 27, 2021