సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ‘పెళ్లి సందD’ చేస్తున్న సంగతి తెలిసిందే.. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోనంకి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కె. కృష్ణమోహన్ రావు సమర్పిస్తుండగా మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రాఘవేంద్ర రావుతో పాటు, ఈ సినిమాకు స్టార్ హీరోల సహకారం అందుతుండటంతో మంచి ప్రమోషన్ లభిస్తోంది. రీసెంట్ గా ‘పెళ్లి సందD’ టీజర్ అక్కినేని నాగార్జున విడుదల చేయగా.. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రేపు ఉదయం 11 గంటలకు ఈ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. చిత్రీకరణ పూర్తికావొస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనుంది.