సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలతో పాటు ఫ్యామిలీ టైంకి కూడా పర్ఫెక్ట్ గా బాలన్స్ చేస్తూ ఉంటాడు. సినిమాలకి ఎంత టైం స్పెండ్ చేస్తాడో, ఫ్యామిలీకి కూడా అంతే క్వాలిటీ టైం ఇవ్వడంలో మహేశ్ చాలా స్పెషల్. సినిమా సినిమాకి మధ్య గ్యాప్ లో ఫారిన్ ట్రిప్ కి వెళ్లి అక్కడ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే మహేశ్, మరోసారి ఫారిన్ ట్రిప్ కి వెళ్లనున్నాడు. క్రిస్మస్, న్యూఇయర్ ని మహేశ్ ఫారిన్ లోనే సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. ప్రతి ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా డిసెంబర్ థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ మహేశ్ ఫారిన్ లో ఎంజాయ్ చేయనున్నాడు.
మహేశ్ ఫారిన్ ట్రిప్ వెళ్తుండడంతో ‘SSMB 28’ సినిమా జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేశ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమాగా అనౌన్స్ అయిన ‘SSMB 28’ ఇటివలే ఒక షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది. నెక్స్ట్ షెడ్యూల్ మొదలవ్వాల్సిన సమయంలో కృష్ణ చనిపోవడంతో, ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. డిసెంబర్ 8 నుంచి ‘SSMB 28’ కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని అంతా అనుకున్నారు కానీ షూటింగ్ కి కాస్త గ్యాప్ ఇచ్చి ముందు మ్యూజిక్ సిట్టింగ్స్ కంప్లీట్ చేయడానికి త్రివిక్రమ్ ప్రిపేర్ అవుతున్నాడు. ఇప్పటికే ముంబైలో తమన్, త్రివిక్రమ్, మహేశ్ బాబు కలిసారు. మహేశ్ ఫారిన్ ట్రిప్ కంప్లీట్ చేసుకోని వచ్చే లోపు మ్యూజిక్ సిట్టింగ్స్ తో పాటు, ప్రీప్రొడక్షన్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసేలా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. అయితే గతంలో జరిగిన షూటింగ్ పార్ట్ ‘SSMB 28’ సినిమాలో ఉంటుందా లేదా అనుమానం మహేశ్ ఫాన్స్ లో ఉంది. అప్పుడున్న కథకి, ఇప్పుడు చేయబోయే కథకి చాలా తేడా ఉంది… త్రివిక్రమ్ ముందు రాసుకున్న కథని మార్చి, పూర్తిగా కొత్త కథని రాసాడు అనే రూమర్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇది ఎంత వరకూ నిజమనే విషయం మేకర్స్ కి మాత్రమే తెలియాలి.