సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ‘SSMB 28’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్ళింది. అతడు, ఖలేజా సినిమాలతో ఫాన్స్ ని ఎంటర్టైన్ చేసిన ఈ కాంబినేషన్ ఈసారి మాత్రం బాక్సాఫీస్ ని షేక్ చెయ్యాలి అనే టార్గెట్ తో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం షెడ్యూల్ బ్రేక్ లో ఉన్న SSMB 28 కొత్త షెడ్యూల్ జూన్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ అవ్వనుంది. పూజా హెగ్డే, శ్రీలీలా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి ‘గుంటూరు కారం’, ‘అమరావతికి అటు ఇటు’ అనే టైటిల్స్ ని కన్సిడర్ చేస్తున్నారు. దాదాపు ‘గుంటూరు కారం’ టైటిల్ ని లాక్ చేసి మే 31న అఫీషియల్ గా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి, ఆరోజు ఫాన్స్ కి స్పెషల్ ట్రీట్ గా SSMB 28 టైటిల్ అనౌన్స్మెంట్ అండ్ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చెయ్యడానికి సితార ఎంటర్టైన్మెంట్స్ రెడీ అయ్యారు.
మరో వారం లోపే SSMB 28 అప్డేట్ బయటకి వస్తుండడంతో మహేష్ ఫాన్స్ అంతా సోషల్ మీడియాలో అసెంబుల్ అయ్యారు. ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ తో హల్చల్ చేస్తున్నారు. అలా ఫాన్స్ క్రియేట్ చేసిన ఒక పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ బాబు కత్తి పట్టుకోని నిలబడినట్లు కనిపించిన ఆ ఫ్యాన్ మేడ్ పోస్టర్ చూస్తే ఇది అఫీషియల్ గా రిలీజ్ చేసిన పోస్టర్ ఏమో అనిపించకమానదు. ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఈ రేంజులో ఉంటే ఇక త్రివిక్రమ్ డిజైన్ చేసిన పోస్టర్ ఎలా ఉండబోతుందో ఊహించొచ్చు. మరి మే 31న ఏ టైమ్ కి SSMB 28 టైటిల్ అనౌన్స్మెంట్ అండ్ గ్లిమ్ప్స్ బయటకి వస్తుందో చూడాలి.