సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. మే 12న వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ఈ సినిమాను మహేష్ బాబు అభిమానులు బాగా ఆదరించారు. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత వినోదం, సెకండ్ హాఫ్‌లో లేదని సగటు సినిమా ప్రేక్షకుడు పెదవి విరిచినా, కలెక్షన్లను మాత్రం ఈ సినిమా బాగానే రాబట్టింది. దానికి తోడు సినిమా విడుదలైన అంతకు ముందు చిత్రీకరించిన మరో పాటను జత చేయడంతో మహేష్‌బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీని ఇదే నెల 23న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. విశేషం ఏమంటే ‘సర్కారు వారి పాట’ను అమెజాన్ లో తెలుగుతో పాటు తమిళ, మలయాళ వర్షన్స్ లోనూ చూసి ఆనందించొచ్చు. మరి ఈ మూడు భాషల్లో ఓటీటీలో ‘సర్కారు వారి పాట’ ఎలాంటి సందడి సృష్టిస్తుందో చూడాలి.
