Mahesh Babu Reveals Sithara Reaction after Watching Guntur Kaaram Movie: మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి సంధర్భంగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా గురించి అనేక విషయాలు తాజా ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. యాంకర్ సుమ చేసిన ఈ ఇంటర్వ్యూలో మహేష్, శ్రీ లీల అనేక విషయాలను పంచుకున్నారు. అయితే ఈ సినిమాను తాను హైదరాబాద్ సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ లో చూశానని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. చివరిగా తాను ఆ థియేటర్ లో దూకుడు సినిమా చూశానని మళ్లీ ఎందుకు అక్కడే సినిమా చూడాలనిపించి నమ్రతకు విషయం చెబితే ఆమెకు ఒక్కసారిగా యాంగ్జైటీ అటాక్ వచ్చిందని వెల్లడించారు.
Mahesh Babu: గుంటూరు కారం మహేష్ కి చివరి తెలుగు సినిమా? సంచలన వ్యాఖ్యలు వైరల్!
నా కొడుకు, కూతురు ఇద్దరినీ తీసుకొని ఇక్కడికి వెళ్ళాలి అనిపించి, ఇదే విషయం చెప్పడంతో నమ్రత యాంగ్జైటీతో షాక్ అయింది. తాను ఆ ఏర్పాట్లు అన్నీ చేస్తానని చెప్పిన తర్వాత ఆమె కొంచెం కుదుట పడింది. ఎర్లీ మార్నింగ్ షో కి నేను నా కొడుకు గౌతమ్, కుమార్తె సితార భార్య నమ్రతతో కలిసి అక్కడికి వెళ్లాను. సినిమా మొత్తం చూసిన తర్వాత సితార నన్ను హగ్ చేసుకుని థాంక్యూ సో మచ్ నాన్న, ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మీరు సినిమాలో చాలా బాగున్నారు అని చెప్పింది. ఇక గౌతమ్ ఇది అసలు నమ్మలేని ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పుకొచ్చాడు. వాళ్ళు ఎప్పుడూ మార్నింగ్ ఎక్స్పీరియన్స్ చేయలేదు, వాళ్లకి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయించిన తర్వాత వాళ్ళ ఆనందం చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక అక్కడ చూసిన తర్వాత ఆడియన్స్ రియాక్షన్స్ చూసి కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంతేగాక థియేటర్లో నేను కనిపించగానే ఆడియన్స్ పేపర్ల విసురుతూ అరుస్తున్నప్పుడు మా ఎక్స్పీరియన్స్ సితారకి చాలా కొత్తగా అనిపించింది. మీరు చాలా బాగున్నారు స్క్రీన్ మీద మీ ప్రజెన్స్ చాలా బాగుందంటూ ప్రతి క్షణాన్ని ఆమె ఎంజాయ్ చేసిందని మహేష్ చెప్పుకొచ్చారు