Indira Devi:సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఘట్టమనేని కుటుంబ సభ్యుల అశ్రు నివాళుల మధ్య ఇందిరా దేవి అంత్యక్రియలను మహేష్ పూర్తిచేశాడు. పద్మాలయా స్టూడియోస్ నుంచి జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం వరకు సాగిన అంతిమ యాత్రలో ఘట్టమనేని కుటుంబ సభ్యులు, మహేష్ అభిమానులు పాల్గొన్నారు. సాంప్రదాయ పద్దతిలో మహేష్ తన తల్లి అంత్యక్రియలు పూర్తిచేశాడు.
ఇక ఇందిరా దేవి ని కడసారి చూడడానికి పలువురు సినిమా ప్రముఖులు మహాప్రస్థానంకు చేరుకున్నారు. ఘట్టమనేని ఇందిరా దేవి.. సూపర్ స్టార్ కృష్ణ భార్య.. మహేష్ బాబు తల్లి. గత కొన్నిరోజులుగా వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. దీంతో మహేష్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇక ఈ ఏడాదిలోనే మహేష్ తన అన్న రమేష్ ను కూడా పోగొట్టుకున్నారు. వరుస విషాదాలు ఘట్టమనేని కుటుంబాన్ని వదలడంలేదని, మహేష్ తన కుటుంబానికి దైర్యం ప్రసాదించాలని అభిమానులు దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.