సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ వస్తుంటాయి. అలాగే ప్రతి ఆర్టిస్ట్ ను మిమిక్రీ చేస్తుంటారు. దీని గురించి మహేశ్ బాబుని అడిగినపుడు తన వాయిస్ ని ఎవరూ మిమిక్రీ చేయలేరని అన్నారు. తన వాయిస్ ని క్యాచ్ చేయటం అంత ఈజీ కాదని అందుకే ఎవరూ చేయలేదని అన్నారు. కొంత రేంజ్ వరకూ ఓకె కానీ పూర్తి స్థాయిలో ఎవరూ చేయలేరన్నది మహేశ్ నొక్కి చెప్పారు. ఇక ఎవరైనా మితంగా పద్దతిగా తింటే తనలాగే చక్కగా ఉంటారని చెబుతున్నారు మహేశ్.
సీక్వెల్స్ హవా నడుస్తున్న ప్రస్తుత కాలంలో తన హిట్ సినిమా ‘పోకిరి’కి సీక్వెల్ ఎందుకు రాలేదని అడగ్గా దర్శకుడు పూరి జగన్నాథ్ సరైన కథతో వస్తే తప్పక సీక్వెల్ చేస్తానంటున్నాడు. ఇక ‘సర్కారువారి పాట’ సినిమాలో కీర్తిసురేశ్ పాత్ర సర్ ప్రైజింగ్ గా ఉంటుందంటున్నాడు మహేశ్. సినిమాలో తనకు బాగా నచ్చిన పాట ‘కళావతి’ అని చెబుతూ సినిమాలో ‘నేనున్నాను… నేను విన్నాను’ డైలాగ్ ఎందుకు పెట్టామన్నది సినిమా చూస్తే అర్థం అవుతుందని చెబుతూ ఎలాంటి పొలిటికల్ ఇంటెన్షన్ లేదని వివరించారు మహేశ్.