Mahesh Babu: రీజనల్ సినిమాతో ఆర్ ఆర్ ఆర్ రికార్డ్ లేస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“అన్ని సెంటర్స్ లో రాజమౌళి సినిమాల కలెక్షన్స్ ఫిగర్స్ కి దగ్గరగా ఉంటాం” ఇది గుంటూరు కారం ప్రొడ్యూసర్ నాగ వంశీ ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట. ఈ మాటని మహేష్ నిజం చేసి చూపించేలా ఉన్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో 13 ఏళ్ల తర్వాత సినిమా చేస్తున్న మహేష్, గుంటూరు కారం సినిమాతో మాస్ అవతారంలోకి వచ్చేసాడు. ఎవరెన్ని పాన్ ఇండియా సినిమాలు చేసినా ఇప్పటివరకూ రీజనల్ సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్న మహేష్ బాబు, మొదటిసారి రాజమౌళితో నెక్స్ట్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు అంటే మహేష్ నుంచి వచ్చే లాస్ట్ రీజనల్ సినిమా గుంటూరు కారం మాత్రమే. జక్కన్నతో సినిమాతో అంటే మహేష్ మూడున్నర ఏళ్లు తెరపై కనిపించే అవకాశమే లేదు అందుకే గుంటూరు కారం మూవీతో రాజమౌళి రికార్డులని రీచ్ అవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
నైజాంలో ఇప్పటికే సాలిడ్ నంబర్ ఆఫ్ థియేటర్స్ గుంటూరు కారం అండర్ లోకి వెళ్లిపోయాయి. రీజనల్ సినిమాతో మహేష్ బాబు వంద కోట్ల ఓపెనింగ్స్ రాబడతాడు అంటూ మహేష్ ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఇది చాలదన్నట్లు యు.ఎస్.ఏలో గుంటూరు కారం సినిమాకి 5408 ప్రీమియర్ షోస్ కేటాయించారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఆ స్థాయి షోస్ పడుతుంది గుంటూరు కారం సినిమాకే. మామూలుగానే మహేష్ బాబు అమెరికాలో సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతూ ఉంటాడు. యు.ఎస్. ఏలో మహేష్ బాబుకి ఉన్న రికార్డ్స్ వేరే ఏ హీరోకి లేవు. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ రేంజులో షోస్ పడుతున్నాయి అంటే ఆర్ ఆర్ ఆర్ ప్రీమియర్స్ రికార్డ్స్ ని గుంటూరు కారం టార్గెట్ చేస్తున్నట్లే ఉంది.
Also Read
- The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
- Chiru Leaks: 'కాకా'లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రీమియర్స్+డే 1 కలిపి యు.ఎస్.ఏలో 5.5 మిలియన్ డాలర్స్ ని రాబట్టింది. ఇటీవలే సలార్ సినిమా 3.8 మిలియన్ డాలర్స్ ని రాబట్టింది. గుంటూరు కారం సినిమా 5.5 మిలియన్ బ్రేక్ చేయకున్నా… సలార్ 3.8 దాటితే మాత్రం సింగిల్ లాంగ్వేజ్ సినిమాల కలెక్షన్స్ విషయంలో అద్భుతం జరిగినట్లే. మరి రికార్డ్ నంబర్ ఆఫ్ షోస్ తో గుంటూరు కారం సినిమా ఆర్ ఆర్ ఆర్ ని టార్గెట్ చేస్తుందా? సలార్ ని బీట్ చేస్తుందా లేదా అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!