Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు ఆగస్టు 9న రాబోతోంది. ఆయన బర్త్ డే కానుకగా అతడు మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ముందు పెద్ద సవాళ్లే ఉన్నాయి. ఈ సినిమాకు ముందు కింగ్ డమ్ థియేటర్లలో ఆడుతోంది. అటు మైత్రీ మూవీ మేకర్స్ కన్నడ నుంచి సు ఫ్రమ్ సో అనే మూవీని తీసుకొస్తోంది. ఆ మూవీకి పెద్దగా బజ్ లేకపోయినా.. ఇప్పుడు మేజర్ థియేటర్లు అన్నీ కింగ్ డమ్ చేతిలోనే ఉన్నాయి. ఫలితంతో సంబంధం లేకుండా ఆగస్టు 14 వరకు కింగ్ డమ్ నే వేయాలంటూ ముందే థియేటర్లతో అగ్రిమెంట్ చేసుకున్నారు. కాబట్టి అతడు మూవీకి పెద్దగా థియేటర్లు దొరక్కపోవచ్చు.
Read Also : Anchor Ravi : ఆ యాంకర్ నాపై చేతబడి చేయించింది.. రవి షాకింగ్ కామెంట్స్
రీరిలీజ్ హక్కుల కోసం రూ.3.5 కోట్లు పెట్టి తీసుకున్నారంట. ఇది రికవరీ కావాలంటే రూ.10 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టాల్సిందే. ఐదు రోజుల గ్యాప్ లో కూలీ, వార్-2 వస్తున్నాయి. ఇంకోవైపు మహావతార్ నరసింహా థియేటర్లలో తగ్గేదే లే అన్నట్టు రోజుకు లక్షన్నర టికెట్లతో దూసుకుపోతోంది. అతడు మూవీ కోసం ఆ సినిమాను తీసేసే సీన్ లేదు. కాబట్టి అతడు మూవీ అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టకపోతే కష్టమే. మహేశ్ బాబు ఇమేజ్ కు ఇది సవాల్ లాంటిది. కాబట్టి మహేశ్ బాబు ఫ్యాన్స్ ఏకతాటిగా సినిమాకు వెళ్తే తప్ప బటయ పడే పరిస్థితి కనిపించట్లేదు.
Read Also : Rashmika : ఎవరినీ తొక్కాలని చూడొద్దు.. రష్మిక షాకింగ్ కామెంట్స్