ఘట్టమనేని రమేష్ బాబు అనారోగ్యంతో నిన్న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈరోజు ఆయన అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో ముగిశాయి. అయితే అన్నయ్యను కడసారిగా కూడా చూసుకునే భాగ్యం కలగలేదు మహేష్ బాబుకు కలగలేదు. రీసెంట్ గా మహేష్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆయన ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. అందుకే మహేష్ సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయారు. అయితే ఆయన సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ‘మళ్ళీ జన్మంటూ ఉంటే నువ్వే నా అన్నయ్య…’ అంటూ ఆవేదనను వ్యక్తం చేశారు.
Read Also : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రైవేట్ పిక్ లీక్… మీడియాకు రిక్వెస్ట్
“మీరు నాకు స్ఫూర్తిగా నిలిచారు
నువ్వే నా బలం
నువ్వు నా ధైర్యం
నువ్వే నా సర్వస్వం
నువ్వు లేకుంటే ఈ రోజు ఉన్న మనిషిలో సగం ఉండేవాడిని కాదు. మీరు నా కోసం చేసిన ప్రతిదానికీ ధన్యవాదాలు.
ఇప్పుడు విశ్రాంతి… విశ్రాంతి…
నాకు మరో జీవితమంటూ ఉంటే నువ్వే నా అన్నయ్యగా ఉంటావు
ఇప్పటికీ, ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను” అంటూ ఫేస్ బుక్ లో తన సోదరుడి మృతిపై ఎమోషనల్ పోస్ట్ చేశారు.