బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రైవేట్ పిక్ లీక్… మీడియాకు రిక్వెస్ట్

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రైవేట్ పిక్ లీక్ అవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటికే ఆమె 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరవుతుండగా, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే తాజాగా వీరిద్దరికీ సంబంధించిన ఓ ప్రైవేట్ పిక్ లీక్ అయ్యింది. అందులో సుకేష్ జాక్వెలిన్‌ను ముద్దుపెట్టుకోవడం కనిపించింది. ఆ పిక్ చూస్తుంటే సెల్ఫీలా ఉంది. ప్రస్తుతం జాక్వెలిన్ సెల్ఫీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సుకేష్ ఒక ఇంటర్వ్యూలో జాక్వెలిన్‌తో డేటింగ్ చేస్తున్నానని చెప్పిన కొన్ని రోజుల తర్వాత ఈ పిక్ లీక్ అవ్వడం విశేషం. కొన్ని రోజుల క్రితం వీరిద్దరికీ సంబంధించిన మరో పిక్ కూడా ఇంటర్నెట్ లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

ఇక తాజాగా వైరల్ అవుతున్న పిక్ గురించి జాక్వెలిన్ మాట్లాడుతూ తన ప్రైవసీని దృష్టిలో పెట్టుకుని ఆ పిక్స్ షేర్ చేయొద్దని సోషల్ మీడియా వేదికగా కోరింది. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్ట్ ను ట్విట్టర్ లో షేర్ చేస్తూ తాను ఈ దేశం, ఇక్కడి ప్రజలు తనకు చాలా ప్రేమను, గౌరవాన్ని పంచారని, “మీడియా, స్నేహితుల నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నేను ప్రస్తుతం కఠినమైన పాచ్‌ను ఎదుర్కొంటున్నాను. కానీ నా స్నేహితులు, అభిమానులు నా గోప్యత, వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగించే ఫోటోలను ప్రసారం చేయొద్దని నా మీడియా స్నేహితులను అభ్యర్థిస్తున్నాను. మీకు స్వంత వారికి ఇలా చేయరు. న్యాయం విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు” అంటూ మీడియాను అభ్యర్థించినట్లు రాసింది.

Image

జాక్వెలిన్ నిందితుడు సుకేష్ చంద్రశేఖర్ నుంచి కోట్ల విలువైన బహుమతులను అందుకున్నారని, అందులో రూ. 52 లక్షలు, ఓ ఖరీదైన కారుతో పాటు మరిన్ని విలువైన బహుమతులు ఉన్నాయని వార్తలు వచ్చాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్న మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్, సుకేష్ చంద్రశేఖర్ ఇద్దరూ ఉన్నారు. ఫిబ్రవరి 2017 నుండి నేను సుకేష్‌తో మాట్లాడుతున్నాను. ఆగస్ట్ 2021 లో అతను అరెస్టు అయ్యాడు. ఆ తర్వాత నేను అతనిని ఎప్పుడూ కలవలేదు. ఆయన సన్ టీవీ యజమాని అని, జయలలిత రాజకీయ కుటుంబం నుండి వచ్చానని నాకు చెప్పాడు అని జాక్వెలిన్ చెప్పుకొచ్చింది. ఈ మనీలాండరింగ్ కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రైవేట్ పిక్ లీక్… మీడియాకు రిక్వెస్ట్

Related Articles

Latest Articles