బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తన్న 200 కోట్ల భారీ మోసం కేసులో ఇప్పటికే జైలులో ఉన్న సుకేశ్ చందశేఖర్ స్నేహితురాలు లీనా మరియా పాల్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. లీనాను పోలీసులు అరెస్టు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో లీనా తన ప్రియుడితో కలిసి 2013లో బ్యాంకును మోసం చేసింది. ఆ తర్వాత ఇద్దరూ 2015లో అరెస్టయ్యారు. లీనా.. జాన్ అబ్రహంతో కలిసి “మద్రాస్ కేఫ్”లో నటించింది. ఇంకా అనేక బాలీవుడ్ చిత్రాలలో కన్పించింది. సుకేశ్ ప్రస్తుతం పోలీసు రిమాండ్‌లో ఉన్నాడు. త్వరలో ఈడీ అతడిపై విచారణకు సిద్ధమవుతోంది. సుకేశ్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నాడు. అతను జైలులో కూర్చునే ఈ రాకెట్‌ను నడిపించడం విశేషం. నటి లీనా మరియా పాల్‌ను చీటింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు సుకేశ్, అతని సహచరులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో మరింత మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
Read Also : సరిహద్దులు దాటిన ప్రేమ… అజిత్ కు రష్యా కారు డ్రైవర్ గిఫ్ట్
ఈ కేసు దర్యాప్తులో ఈడీకి గట్టి ఆధారాలు లభించడంతో లీనాను అరెస్టు చేశారు. లీనా బాయ్‌ఫ్రెండ్ సుకేశ్ చంద్రశేఖర్ జైలు లోపల నుండి స్పూఫ్ కాల్స్ ద్వారా ఇద్దరు వ్యాపారవేత్తల కుటుంబాలను మోసం చేసి కోట్ల రూపాయలు లాగారు. సుకేశ్ సుమారు 200 కోట్లు మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో సుకేశ్‌తో పాటు అతని భార్య, ఇంకా చాలా మంది బ్యాంక్ ఉద్యోగులు కూడా నిందితులుగా ఉన్నారు. ఇటీవల చెన్నైలోని సుకేశ్ బంగ్లాపై ఈడీ దాడి చేసింది. ఆయనకు సంబంధించిన 16 పెద్ద వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ బ్రాండ్ల ఖరీదైన దుస్తులు కూడా ఇంట్లో దొరికాయి. వీరి విలువ కోట్లలో ఉంటుంది.