సరిహద్దులు దాటిన ప్రేమ… అజిత్ కు రష్యా కారు డ్రైవర్ గిఫ్ట్

ఇటీవల కాలంలో మన హీరోల అభిమానుల సంఖ్య, ప్రేమ్ ఎల్లలు దాటుతోంది. తాజాగా అజిత్ కోసంఓ రష్యన్ అభిమాని ఇచ్చిన గిఫ్ట్ చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అజిత్ “వాలిమై” సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా తుది షూటింగ్ కోసం చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం రష్యా వెళ్లింది. తల అజిత్ పాల్గొన్న అతి పెద్ద బైక్ ఫైట్‌లు మాస్కో సమీపంలోని కొలొమ్నాలో చిత్రీకరించారు. అత్యంత జాగ్రత్తగా ప్లాన్ చేసిన ఈ సినిమా షూటింగ్ పూర్తయిన రోజున ఒక రష్యన్ వ్యక్తి తల అజిత్‌కు ప్రత్యేక బహుమతిని అందించాడు.

Read Also : డైరెక్టర్ శంకర్ కూతురు మూవీ ఎంట్రీ… కార్తికి జోడిగా…!

అలెక్స్ అనే వ్యక్తి “వాలిమై” రష్యాలో చిత్ర బృందానికి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతను రష్యాలో ఈ సినిమాకు సంబంధించి చిత్రీకరణ జరుగుతున్నన్ని రోజులూ అజిత్ ను గమనిస్తూనే ఉన్నాడు. అంతే కొన్ని రోజుల్లోనే ఆయనకు ఫ్యాన్ అయిపోయాడు. షూటింగ్ పూర్తయిన సందర్భంగా అజిత్ కి రెండు టీ షర్టులు, ఒక కప్పు టీ, ఓ ప్రసిద్ధ చాక్లెట్ బహుమతిగా ఇచ్చారు. ఆ షర్ట్ పై “అజిత్ ది బెస్ట్” అని రాసుంది. అంతేకాదు కొలొమ్నా మిమ్మల్ని ఇష్టపడుతోంది అని కూడా ఉంది.

బోనీకపూర్ నిర్మాణంలో తల అజిత్ హీరోగా, దర్శకుడు హెచ్. వినోద్, యువన్ శంకర్, నిరవ్ షా కాంబోలో రూపొందుతున్న రెండవ చిత్రం “వాలిమై” “వాలిమై” చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశలో ఉంది. దీని తరువాత చిత్ర బృందం సినిమా పోస్టర్‌లను, మొదటి సింగిల్‌ని విడుదల చేసి, సినిమాను ప్రమోట్ చేయడం ప్రారంభిస్తుంది. రాబోయే రోజుల్లో సినిమాలోని అన్ని పాటలు, టీజర్‌లు, ట్రైలర్లు విడుదల చేయడానికి సిద్ధమవుతోంది చిత్రబృందం.

Ajith receives special token of love from a Russian Local Driver

Related Articles

Latest Articles

-Advertisement-