Madala Ravi Birthday Special : నాన్న బాటలో నడచిన మాదాల రవి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తండ్రుల బాటలోనే పయనించాలని తపించే తనయులు అన్ని రంగాల్లోనూ కనిపిస్తారు. కొందరు తండ్రులకు తగ్గ తనయులు అనిపించుకుంటారు. మరికొందరు తండ్రులను మించిన తనయులుగానూ కనిపిస్తారు. ఇంకొందరు నాన్నలాగే తమ ఉనికినీ చాటుకుంటారు. రెడ్ స్టార్ గా జనం మదిలో నిలచిన నటదర్శకనిర్మాత మాదాల రంగారావు తనయుడు మాదాల రవి సైతం నాన్న బాటలో నడిచారు. నటునిగా తానూ నేను సైతం అంటూ ఎర్రజెండా ఎగరేశారు.
మాదాల రవి 1971 జూలై 28న జన్మించారు. ఆయన తండ్రి మాదాల రంగారావు, తల్లి పద్మావతి ఇద్దరూ ప్రజానాట్యమండలి సభ్యులుగా పలు నాటకాల్లో నటించారు. తరువాతే మాదాల రంగారావు సినిమా రంగం బాట పట్టారు. తాను నిర్మించి, నటించిన చిత్రాలలో వామపక్ష భావాలు పలికించి, రెడ్ స్టార్ గా పేరు సంపాదించారు మాదాల రంగారావు. రవి బాల్యంలోనే తండ్రి నిర్మించి, నటించిన ‘ఎర్రమల్లెలు’ చిత్రంలో హీరో మురళీమోహన్ కు బావమరిదిగా నటించాడు. అందులో రవిపై ప్రత్యేకంగా చిత్రీకరించిన “నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో…” పాట అప్పట్లో విశేషాదరణ పొందింది. తరువాత చదువుపై ధ్యాస నిలిపి, రష్యా వెళ్ళి డాక్టర్ చదువు చదివి వచ్చారు రవి. వచ్చాక కొంతకాలం డాక్టర్ గా ప్రాక్టీస్ చేశారు. ఆ పై తండ్రి బాటలోనే పయనిస్తూ నటునిగా మారారు. రవి మామ ప్రముఖ నిర్మాత కె.మహేంద్ర కావడంతో అల్లుడి అభిలాషను ఆయన కూడా ప్రోత్సహించారు. అలా “నేను సైతం” సినిమా ద్వారా హీరో అయ్యారు రవి. అందులో తండ్రి బాటలోనే వామపక్ష భావాలు పలికించారు. ఆ పై “మా ఇలవేల్పు, వీరగాథ” పంచముఖి, బ్రోకర్ 2 వంటి చిత్రాలలో ప్రధాన భూమికలు ధరించారు. మరికొన్ని సినిమాల్లోనూ రవి నటించారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయాలన్న తపనతోనే ఉన్నారు రవి. ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ లో ప్రస్తుతం ఉపాధ్యక్షునిగా సేవలు అందిస్తున్నారు రవి.
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!