తమన్నా లేడీ బౌన్సర్‌గా నటించిన ‘బబ్లీ బౌన్సర్’ ఈ నెల 23న ఓటీటీలో విడుదల కానుంది. నేషనల్ అవార్డ్ డైరెక్టర్ మాధుర్ భండార్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ స్టూడియోస్, జంగిలీ పిక్చర్స్ నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ తో పాట పాటకు కూడా మంచి స్పందన లభించింది. 23న విడుదల కానున్న సందర్బంగా చిత్ర దర్శకుడు మాధుర్ భండార్కర్, హీరోయిన్ తమన్నా మీడియాతో మీట్ అయ్యారు. మాధుర్ మాట్లాడుతూ ‘లేడీ బౌన్సర్ లను స్ఫూర్తిగా తీసుకొని సినిమా చేశాం. హీరోయిన్ బబ్లీగా ఉండి ఫిజికల్ గా, మెంటల్ గా మెచ్యూరిటీ ఉండాలి. అందుకే తమన్నా ది బెస్ట్ అనిపించింది. బాహుబలిలో తమన్నా చేసిన పాత్ర ఆమెలోని నటిని బయటకు తీసుకువచ్చింది అనుకుంటాను. ఈ సినిమాకు తమన్నాను ఎందుకు తీసుకున్నావని అడిగిన వారందరూ ట్రైలర్ చూసిన తరువాత మీ ఛాయిస్ 100% కరెక్ట్ అని చెప్పారు. తమన్నా బౌన్సర్ గా చాలా చక్కగా నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను తప్పక అలరిస్తుంది’ అన్నారు.
తమన్నా మాట్లాడుతూ ‘తెలుగు సినిమా అంటే గర్వంగా ఫీల్ అవుతాను. నా ప్రయాణం ఇక్కడే సార్ట్ ఆయ్యింది. రాజమౌళి, సుకుమార్ వంటి దర్శకులు మన ఇండియన్ రూట్స్ తో కథలు రెడీ చేసి సినిమాలు చేస్తుంటారు. మన ఇండియన్ సినిమాను ఏమోషన్సే నడిపిస్తాయి. తొలిసారి లేడీ బౌన్సర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా దొరకడం నా అదృష్టం. పలు జాతీయు అవార్డ్స్ పొందిన మాధుర్ భండార్కర్ తో పనిచేసే అవకాశం వచ్చిందుకు గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ఇది నా కేరీర్ లో బెస్ట్ సినిమా అవుతుంది. మాధుర్ సినిమాలో నటించిన హీరోయిన్స్ కు జాతీయ అవార్డ్స్ వస్తాయి. నాకు కూడా రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను’ అని అన్నారు.