Love Today Bhediya Itlu Maredumilli Prajanikam Movies Releasing On Nov 25: చిరు బాలయ్య లాంటి సీనియర్ స్టార్ హీరోలు సంక్రాంతి సీజన్ ని కాష్ చేసుకోవడానికి రెడీ అవుతూ, 2022 ఇయర్ ఎండింగ్ ని పెద్దగా పట్టించుకోలేదు. చరణ్ ప్రభాస్ ల సినిమాలు ఇంకా సెట్స్ పైనే ఉన్నాయి, అల్లు అర్జున్ ఎన్టీఆర్ తమ సినిమాలని మొదలు కూడా పెట్టలేదు. విశ్వక్, నితిన్, నిఖిల్ లాంటి టైర్ 2 హీరోలు ఇటివలే తమ సినిమాలని విడుదల చేసేశారు. ఇలా స్టార్ హీరోస్ నుంచి యంగ్ హీరోస్ వరకూ అందరి సినిమాలు ఈ మధ్య రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. దీంతో పెద్ద సినిమాలేవీ థియేటర్స్ లోకి రాని ఈ టైం కాష్ చేసుకోవాలని చూస్తున్న చిన్న సినిమాల నిర్మాతలు తమ చిత్రాలని విడుదల చేస్తున్నారు. ఈ కోవలోనే గత శుక్రవారం సరిగ్గా పేరు కూడా తెలియని నాలుగైదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలేవీ ప్రేక్షకులని మెప్పించే స్థాయిలో లేకపోవడంతో సమంతా నటించిన యశోద సినిమానే ట్రెండింగ్ లో ఉంది. అయితే నవంబర్ మూడో వారం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.
నవంబర్ 25న మూడు కంటెంట్ ఉన్న సినిమాలు ఆడియన్స్ ముందుకి రాబోతున్నాయి. అందులో ఒకటి అల్లరి నరేష్ నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఇంకొకటి తమిళనాట హౌజ్ ఫుల్ షోస్ తో నడుస్తున్న లవ్ టుడే, మూడోది ఫాంటసీ డ్రామాగా జానర్ లో తెరకెక్కిన భేదియా. నాంది సినిమాతో ట్రాక్ మార్చిన అల్లరి నరేష్ మరోసారి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్నాడు. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా నుంచి ఇప్పటివరకూ బయటకి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సో ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా అల్లరి నరేష్ అకౌంట్ లో మరో మంచి సినిమా అయ్యే ఛాన్స్ ఉంది. ఇక తమిళ్ నాడులో చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న లవ్ టుడే సినిమాని తెలుగులో దిల్ రాజు డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే లవ్ టుడే గురించి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది కాబట్టి తెలుగు యూత్ కూడా బాగా కనెక్ట్ అవుతారు అనడంలో సందేహం లేదు.
లవ్ టుడే, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాలు సోషల్ అండ్ ఫన్ జానర్స్ లో తెరకెక్కితే… ఫాంటసీ జానర్ లో రూపొందిన సినిమా భేదియా. వరుణ్ ధావన్ కృతి సనన్ జంటగా నటించిన ఈ మూవీలో హీరోకి వోల్ఫ్ కరుస్తుంది. ఇక్కడి నుంచి హీరోకి వోల్ఫ్ లక్షణాలు వస్తాయి. ఆ తర్వాత హీరో ఎలాంటి స్టంట్స్ చేశాడు అనేది భేదియా చూసి తెలుసుకోవాల్సిందే. హిందీతో పాటు తెలుగు తమిళ భాషల్లో కూడా ఈ మూవీ రిలీజ్ అవుతోంది. సౌత్ లో పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు కానీ ఫాంటసీ డ్రామాలని చూడడానికి ‘A’ సెంటర్స్ లో ఒక సెక్టార్ ఆఫ్ ఆడియన్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. టాక్ బాగుంటే భేదియా సినిమా తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ ని రాబడుతుంది. మొత్తానికి వచ్చే వారం విడుదల అవనున్న ఈ మూడు సినిమాలు, మూడు డిఫరెంట్ జానర్స్ లో తెరకెక్కి ఆడియన్స్ ముందుకి రానున్నాయి. మరి ఆడియన్స్ ఏ సినిమాని ఎంతగా ఆదరిస్తారో చూడాలి.