రణ్ వీర్ సింగ్ తో పెళ్ళి తర్వాత కూడా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తన హవా కొనసాగిస్తోంది. ఇటు సినిమాల్లోనే కాదు అటు బ్రాండ్ అంబాసిడర్ గానూ సత్తా చాటుతోంది. తాజాగా ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ లూయిస్ విట్టన్‌కు తొలి ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. లూయిస్ విట్టన్ విడుదల చేసిన సరి కొత్త లెదర్ బ్యాగ్ ‘కజిన్’ కి దీపికనే బ్రాండ్ అంబాసిడర్. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకుంది దీపిక. ఈ ఫేమస్ బ్రాండ్‌తో తన భాగస్వామ్యంపై వ్యాఖ్యానిస్తూ ‘లూయిస్ విట్టన్‌తో నా అనుబంధం నిజమని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను’ అనేసింది. ఇక దీపిక నటించిన ‘పఠాన్’ విడుదలకు రెడీ అవుతోంది. ప్రభాస్ పాన్ ఇండియా సినిమా ‘ప్రాజెక్ట్ కె’లోనూ నటిస్తోంది దీపిక. అలాగే ‘సర్కస్’ సినిమాలో చిన్న కామియో రోల్ చేస్తోంది. ఇది కాకుండా దీపిక నటిస్తున్న ‘ఫైటర్’ సినిమా కూడా షూటింగ్ లో ఉంది.