Lokesh Kanagaraj to Quit Direction: మా నగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి సినిమాలు చేసి తమిళంలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. చదువు పూర్తి చేసి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఒక కార్పొరేట్ షార్ట్ ఫిలిం కాంపిటీషన్ లో ఆయన చేసిన షార్ట్ ఫిలిం కార్తీక్ సుబ్బరాజు దృష్టిలో పడింది. కార్తీక్ సుబ్బరాజు ప్రోత్సాహంతో డైరెక్టర్ అయిన లోకేష్ అతి తక్కువ సినిమాలే చేసినా తమిళంలో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ప్రస్తుతానికి విజయ్ హీరోగా లియో అనే సినిమా తెరకెక్కించగా ఆ సినిమా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో లోకేష్ కనగరాజ్ ఒక సంచలన ప్రకటన చేశారు. అదేమంటే తాను తన కెరీర్ లో మొత్తం 10 సినిమాలు మాత్రమే చేస్తానని, డైరెక్షన్ నుంచి తప్పుకుంటానని చెప్పుకొచ్చారు.
Guntur Kaaram: మహేష్ ఫాన్స్ కి గుడ్ న్యూస్.. రిలీజ్ పక్కా ఆరోజే!
‘నా కెరీర్‌లో చాలా సినిమాలు చేయాలనే ఆలోచన లేదు, నేను నిర్మాతల సహాయంతో మాత్రమే LCU కాన్సెప్ట్‌ని ప్రయత్నిస్తున్నాను,అలాగే నా కెరీర్లో 10 సినిమాలు చేస్తాను ఆ తరువాత సినిమాలకు దూరమవుతానని వెల్లడించారు. లోకేష్ ప్రకటన తర్వాత, ఆయన అభిమానులు లోకేష్‌ను కోలీవుడ్ క్వెంటిన్ టరాన్టినో అని కామెంట్ చేస్తున్నారు. ఒకరకంగా ఈ వార్త విని సినీ ప్రేమికులు షాక్‌కు గురయ్యారు, లోకేష్ అభిమానులు అయితే ఆయన మరిన్ని సినిమాలు చేయాలని కోరుతున్నారు. ఇక కేవలం తమిళ సినీ పరిశ్రమ అనే కాదు భారతీయ చిత్రసీమలోనే మోస్ట్ వాంటెడ్ దర్శకుల్లో ఆయన ఒకరిగా ఉన్నారు. ఇక విజయ్ నటించిన లియో సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ LCUలో భాగమని భావిస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని ఆయనని అడిగితే ఇప్పుడు ఆ విషయం చెప్పలేనని అన్నారు. కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ ప్రపంచవ్యాప్తంగా హిట్ అయ్యి తమిళ సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.