క్రైమ్ సెంట్రిక్ కథలతో ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసి… తనకంటూ ఒక సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసుకున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. అతి తక్కువ సినిమాలతోనే పాన్ ఇండియా ఇమేజ్ ని సంపాదించుకున్న ఈ డైరెక్టర్ బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం తలైవర్ 171 కథని సిద్ధం చేసే పనిలో ఉన్న లోకేష్ కనగరాజ్… కథని రాసే సమయంలో సోషల్ మీడియాలో కొన్ని నెలల పాటు దూరంగా ఉంటాడు. తన ప్రతి సినిమాకి ఇదే రూల్ ఫాలో అయ్యే లోకేష్ కనగరాజ్, మొదటిసారి తన రూల్ ని బ్రేక్ చేసి సోషల్ మీడియాలో ట్వీట్ చెయ్యాల్సి వచ్చింది. లోకేష్ కనగరాజ్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యింది అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతోంది. కోలీవుడ్ మీడియా కూడా ఇదే మాటని స్ప్రెడ్ చెయ్యడంతో లోకేష్ బయటకి వచ్చాడు.
ఈ విషయంలో లోకేష్ కనగరాజ్ క్లారిటీ ఇస్తూ “నేను X అండ్ ఇన్స్టాగ్రామ్ లో తప్ప ఇంక వేరే ఏ సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ లో అకౌంట్ లేదు కాబట్టి బయట వినిపిస్తున్న వార్తలని పట్టించుకోకండి” అంటూ ట్వీట్ చేసాడు. దీంతో లోకేష్ ఫ్యాన్స్ రిలాక్స్ అయ్యారు. ఇదిలా ఉంటే లోకేష్ నుంచి డిసెంబర్ 12న రజినీకాంత్ పుట్టిన రోజున తలైవర్ 171 ప్రాజెక్ట్ ని సంబందించిన అప్డేట్ బయటకి వస్తుందేమో అని ఈగర్ గా వెయిట్ చేసారు తలైవర్ ఫ్యాన్స్. అయితే లోకీ మాత్రం “హ్యాపీ బర్త్ డే టు అవర్ తలైవర్ రజినీకాంత్ సర్…” అంటూ విష్ చేస్తూ ట్వీట్ చేసాడు. లోకేష్ తన ట్వీట్ లో కనీసం తలైవర్ 171 ట్యాగ్ ని కూడా పెట్టక పోవడంతో ఒక వర్గం రజినీ ఫ్యాన్స్ హార్ట్ అయ్యారు. మరి ఈ విషయంలో లోకేష్ కనగరాజ్ నుంచి ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.
Wishing a very happy birthday to our #Thalaivar @rajinikanth sir! ❤️❤️❤️
May you continue to inspire us, and I wish you all prosperity and good health, sir! 🤗✨— Lokesh Kanagaraj (@Dir_Lokesh) December 12, 2023
Hey all, I’m only available on Twitter and Instagram, I do not have or use any other social media accounts. Please feel free to ignore and unfollow any other hoax accounts!
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) December 13, 2023