Little Hearts : నైన్టీస్ మిడిల్ క్లాస్ అనే వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మౌళి. మౌళి టాక్స్ అంటే సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అనేది మనకు తెలిసిందే. మౌళి హీరోగా, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ హీరోయిన్ శివాని హీరోయిన్‌గా చేసిన లిటిల్ హార్ట్స్ నేడు థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీని సాయి మార్తాండ్ డైరెక్ట్ చేయగా.. ఈటీవీ విన్ ఒరిజినల్ మూవీగా రూపొందిన ఈ సినిమాని బన్నీ వాసు అండ్ ఫ్రెండ్స్ థియేటర్లోకి తీసుకొచ్చారు. ఈ మూవీకి మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ప్రేక్షకుల మౌత్ టాక్ బాగుండటంతో సినిమాను చూసేందుకు మౌళి తన పేరెంట్స్ తో కలిసి థియేటర్ కు వెళ్లాడు.
Read Also : Ghaati : ఘాటీ సీన్లు.. ‘పుష్ప’ మూవీతో పోలుస్తున్న ప్రేక్షకులు..
అక్కడ మౌళిని చూసిన ప్రేక్షకుల అరుపులు మోత మోగిపోయింది. తన కొడుకుకు వస్తున్న ఆదరణ చూసి మౌళి పేరెంట్స్ కన్నీటి పర్యంతం అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో మౌళి తన పేరెంట్స్ ను పరిచయం చేశాడు. సినిమా ఎలా ఉంది అని అక్కడకు వచ్చిన వారందరినీ అడిగి సందడి చేశాడు. మొత్తానికి మొదటి సినిమాతోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మౌళి అంటున్నారు నెటిజన్లు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. భారీ పోటీ ఉన్నా సరే ఈ సినిమానే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
Read Also : Navdeep : నవదీప్ ఇమేజ్ డ్యామేజ్.. అనవసరంగా జడ్జిగా వెళ్లాడా..?