కన్నెపిల్లలపైనే మొన్నటి దాకా మోజు పడిన లియోనార్డో డికాప్రియో ఇప్పుడు ముదురు భామతో సరసాలు సాగిస్తున్నాడట! అదే ప్రస్తుతం హాలీవుడ్ జనాల్లో చర్చనీయాంశమయింది. టీనేజ్ గర్ల్స్ తోనే రొమాన్స్ చేయడానికి ఆసక్తి చూపించే లియోనార్డో ఉన్నట్టుండి సూపర్ మోడల్ ఇరినా షేక్ తో దొరికిపోయాడు. లియోనార్డో, ఇరినా ఇద్దరూ ఇటీవల నియాన్ కార్నివాల్ ఆఫ్టర్ పార్టీలో మీడియా ఫోటోగ్రాఫర్స్ కెమెరా కళ్ళకు చిక్కారు. వారిద్దరి తీరు చూస్తోంటే, డేటింగ్ చేస్తున్నట్టే ఉందని ఫోటోలు చూసిన వారు చెబుతున్నారు. విశేషమేంటంటే లియోనార్డో, ఇరినా ఇద్దరూ ఇద్దరే! అయ్యగారు ఇప్పటికే ఎంతోమంది భామలతో రొమాన్స్ సాగించాడు. ఇక ఇరినా ఏమైనా తక్కువ తిందా? ఆమె సైతం ఇప్పటికి ఇద్దరు సెలబ్రిటీ లవర్స్ ను మార్చేసింది.
లియోనార్డో గురించి చెప్పక్కర్లేదు. అతగాడి విపరీత శృంగార చేష్టలు హాలీవుడ్ లో అందరికీ తెలుసు. ఇక ఇరినా షేక్ అంటారా? మనసుకు నచ్చినవారితో ఎంచక్కా అనుబంధం కొనసాగిస్తూ ఉంటుంది. మొదట్లో ప్రపంచ ప్రఖ్యాత సాకర్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోతో ప్రేమయాత్రలు చేసింది. వీరిద్దరూ కలసి 2010 నుండి 2015 దాకా చెట్టాపట్టాలేసుకు తిరిగారు. ఆ తరువాత హాలీవుడ్ నటుడు బ్రాడ్లే కూపర్ తో 2015 నుండి 2019 దాకా రిలేషన్ షిప్ మెయింటైన్ చేసింది ఇరినా. ఈ నాలుగేళ్ళ కాలంలో ఎవరితోనూ ఇరినా ఇట్టే కలసి పోయింది లేదు. కానీ, ఇప్పుడు మాత్రం లియోనార్డోతో కలసి కనిపించి, కనువిందు చేసింది. మరి లియోనార్డో, ఇరినా ఇద్దరి వ్యవహారం ఎన్నాళ్ళు కొనసాగుతుందో చూడాలి అంటున్నారు హాలీవుడ్ జనం.