కన్నెపిల్లలపైనే మొన్నటి దాకా మోజు పడిన లియోనార్డో డికాప్రియో ఇప్పుడు ముదురు భామతో సరసాలు సాగిస్తున్నాడట! అదే ప్రస్తుతం హాలీవుడ్ జనాల్లో చర్చనీయాంశమయింది. టీనేజ్ గర్ల్స్ తోనే రొమాన్స్ చేయడానికి ఆసక్తి చూపించే లియోనార్డో ఉన్నట్టుండి సూపర్ మోడల్ ఇరినా షేక్ తో దొరికిపోయాడు. లియోనార్డో, ఇరినా ఇద్దరూ ఇటీవల నియాన్ కార్నివాల్ ఆఫ్టర్ పార్టీలో మీడియా ఫోటోగ్రాఫర్స్ కెమెరా కళ్ళకు చిక్కారు. వారిద్దరి తీరు చూస్తోంటే, డేటింగ్ చేస్తున్నట్టే ఉందని ఫోటోలు చూసిన వారు చెబుతున్నారు.…