దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘లియో’. కేవలం ఆరు నెలల్లో కంప్లీట్ అయిన ఈ మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకి రానుంది. పేరుకి పాన్ ఇండియా కానీ లియో సినిమా విడుదలకి ఎక్కడ లేనన్ని కష్టాలు ఉన్నాయి. సొంత రాష్ట్రంలోనే లియో సినిమాకి ఎర్లీ మార్నింగ్ షోస్ లేవు. తమిళనాడు గవర్నమెంట్ లియో సినిమా అన్ని సెంటర్స్ లో మార్నింగ్ షోస్ కి పర్మిషన్ ఇవ్వలేదు. ప్రభత్వ అనుమతి లేకుండా ఎవరైనా ఎర్లీ మార్నింగ్ షోస్ వేస్తే ఆ థియేటర్ యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉంది. అలా సొంత రాష్ట్రంలోనే లియో సినిమాకి పెద్ద దెబ్బ తగిలింది.
తెలుగులో లియో సినిమాకి మంచి థియేటర్స్ వచ్చాయి, బుకింగ్స్ కూడా బాగున్నాయి. నిజానికి విజయ్ సినిమాకి ఇంత గుర్తింపు ఉండేది కాదు కానీ ఇది లోకేష్ కనగరాజ్ సినిమా అవ్వడంతో క్రేజ్ చాలా ఎక్కువగా ఉంది. లోకేష్ ఇంపాక్ట్ తెలుగులో సాలిడ్ బుకింగ్స్ కి కారణం అయ్యింది. తెలుగులో లియో పరిస్థితి ఎంత బాగుందో హిందీలో అంత ఇబ్బంది పడుతుంది లియో మూవీ. హిందీలో మల్టీప్లేక్స్ లో లీయో సినిమా రిలీజ్ లేకపోవడంతో థియేట్రికల్ బిజినెస్ కి భారీ నష్టాలు తప్పేలా లేవు. అసలు హిందీ బెల్ట్ ప్రమోషన్స్ ని కూడా అంతంతమాత్రంగానే చేసారు మేకర్స్. సో పేరుకి పాన్ ఇండియా కానీ రిలీజ్ పరంగా చూస్తే లియో తెలుగు, తమిళ్, మలయాళంలో మాత్రమే థియేటర్స్ ఉన్నాయి. మూడు రీజన్స్ లోనే లియో సినిమా సాలిడ్ గా రిలీజ్ అవుతుంది.